ఆక్సిజన్ నిలిపేసి 238 మంది ప్రయాణికులని హత్య చేసిన పైలట్

Pilot killed 238 passengers by stopping oxygen

2014, మార్చి 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళ్తున్న MH370 విమానం అకస్మాత్తుగా మాయమైన సంగతి తెలిసిందే. ఈ విమానం కోసం ప్రపంచ దేశాలు ఏకమై సోధించినా దాని ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో ఆ విమానం మాయం కావడానికి గల కారణాలను అన్వేషించడానికి నిపుణుల బృందం ఏర్పాటైంది. డిప్రెషన్‌తో బాధపడుతున్న పైలట్ వల్లే విమానం ప్రమాదానికి గురైనట్లు ఈ టీమ్ నిర్ధారణకు వచ్చింది. ప్రమాదం జరిపిన తర్వాత పైలట్ గురించి బంధువులు, స్నేహితుల ద్వారా లభించిన సమాచారం మేరకు నిపుణులు ఈ అంచనాలకు వచ్చినట్లు సమాచారం.  ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఆ విమానం పైలట్ అహ్మద్ షా కావాలనే 40వేల అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లాడని, ఆ తర్వాత క్యాబిన్‌లో ఆక్సిజన్ తగ్గించి ప్రయాణికులను హత్య చేశాడని, ఆ తర్వాత ఒక్కసారిగా విమానాన్ని సముద్రంలోకి పోనిచ్చాడన్నారు. అయితే, ఇదంతా చేయడానికి ముందు అతడు తన కోపైలట్‌ను హత్య చేసి ఉండొచ్చని లేదా క్యాబిన్‌లో పరిస్థితి చూసిరావాలని చెప్పి కాక్‌పీట్ తలుపు బిగించి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉందచ్చని చెబుతున్నారు. ఆక్సిజన్ తీసేయడం వల్ల ప్రయాణికులు స్పృహ కోల్పోయారని, ఆ తర్వాత ఊపిరాడక చనిపోయారన్నారు. దీంతో వారు కనీసం తమ బంధువులకు కూడా సమాచారం ఇవ్వలేకపోయారని తెలిపారు. ప్రమాదానికి ముందు విమానం బీజింగ్ వైపు కాకుండా ఒక్కసారిగా గాల్లో 40 వేల ఎత్తుకు ఎగిరి అక్కడి నుంచి ‘U’ టర్న్ తీసుకుంది. ఆ తర్వాత ఎక్కడ కూలిందనేది స్పష్టత లేదు. అయితే, ఇటీవల ఆ విమానానికి సంబంధించిన శకలాలు దొరికినట్లు సమాచారం వచ్చినా ఖచ్చితంగా ఆ విమానం ఎక్కడ కూలిందో తెలుసుకోలేకపోవడం గమనార్హం. ఈ ప్రమాదం ఇప్పటికీ మిస్టరీగానే నిలిచిపోయింది.