మే 15 తర్వాత జరగబోయేది అదేనా ?

PM modi may take revenge on Chandrababu after may 15

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసింది అలాగే 12వ తేదీన పోలింగ్, 15వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అదే రోజు కర్నాటక ముఖ్యమంత్ర్ ఎవరో తేలిపోనుంది. అయితే గత కొద్ది రోజులుగా బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలని బట్టి కౌంటింగ్ తర్వాత చంద్రబాబు సర్కార్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని అర్ధం అవుతోంది. ముఖ్యంగా పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది చంద్రబాబుకి ఎంత ఇచ్చినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంటే ఆయా ప్రాజెక్టుల పనుల మీద అవినీతి జరిగిందంటూ విచారణలకి ఆదేశించే అవకాశాలు కనపడుతున్నాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు కొద్ది రోజుల్లోనే వేగంగా మారనున్నాయని జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత కాక రేపుతున్నాయి. కొద్దిరోజుల్లోనే తెలుగుదేశం పార్టీని ప్రజాకోర్టులో నిలబడతామని ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఏపీలో జరిగిన అవినీతిపై చర్యలకు దిగుతుందని భావిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో విలాసాలు చేస్తూ విదేశాలకు వెళ్లకుండా ఆ నిధులను రాష్ట్రాభివృద్ధికి వాడుంటే బాగుండేది అని బీజేపీ ఇప్పుడు కోరడం మరిన్ని అనుమానాలకి తావిస్తోంది. కర్ణాటక పేరు ప్రస్తావించకుండా అక్కడి ప్రభుత్వానికి చుట్టుకున్న సమస్యలన్నీ ఏపీకి కూడా చుట్టుకుంటాయనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అంటే ఎన్నికల వేళ కన్నడ కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ఏపీలోనూ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతాయా? అనే చర్చ తెలుగుదేశం పార్టీలో మొదలయిందని అనుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన చంద్రబాబు జీవీఎల్ వ్యాఖ్యలపై స్పందించారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఫినిష్ అయిపోయిందని ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడని, మనకు చుక్కలు చూపిస్తామని అంటున్నారని ఈనెల 15వ తేదీ తర్వాత మనకు చుక్కలు చూపిస్తామని, ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికే పరిస్థితికి వచ్చారంటే… ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నమన్న అంశం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని’’ బాబు అన్నారు. అలాగే ఎవరూ తెలుగు దేశం పార్టీని ఏమీ చేయలేరని.. ఆ విషయం బీజేపీ గుర్తుపెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. ఎటువంటి వాటికి భయపడవద్దని, మోడీపై పోరాటం మాత్రం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. మోడీ ని ఎదిరిస్తే ఊరుకోరన్న సంగతి తనకు తెలియంది కాదని, అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు చెప్పారు.