పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గన్‌ మిస్‌ఫైర్‌ అయి విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఉదయం కర్నూలు సెకండ్‌ బెటాలియన్‌ ఏపీఎస్పీ సీఐజీ గార్డు సాల్మన్‌ రాజు విధుల్లో ఉండగా గన్‌ మిస్‌ఫైర్‌ అయింది.

పెద్ద శబ్ధం రావటంతో సహోద్యోగులు వెళ్లి చూడగా సాల్మన్‌ రాజు ఒంటినిండా రక్తంతో నేలపై కూర్చుని కనిపించారు. అతడి శరీరంలోకి బుల్లెట్‌ దిగిందని గుర్తించిన వారు ఆసుపత్రికి తరలించే లోపే అక్కడికక్కడే మరణించారు. అయితే గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యిందా లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్న వివరాలు తెలియరావాల్సి ఉంది.