పోలీసు రక్షణ కోసం వెళ్తున్న మహిళకు పోలీసే షాక్ ఇచ్చాడు.

ఒడిశా రాజదాని భువనేశ్వర్ లో మరో ఘోరం వెలుగు చూసింది. ప్రజలను కాపాడాల్సిన రక్షణభటులే కాలయముడిలా మారారు. బాధ్యతాయుత స్థానలంలో ఉన్న పోలీసు ఉద్యోగం చేసే వ్యక్తి కీచకుడిగా మారిన వైనాన్ని చూసి సమాజం నివ్వెలపోయింది. అర్ధరాత్రి సాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్న వివాహితను మార్గమధ్యంలో అడ్డగించి పోలీస్ అత్యాచారానికి యత్నించాడు. ఈ దారుణ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో సంచలనం రేపుతోంది.

కాగా నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ తాజాగా రాత్రి భర్తతో గొడవపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్థానిక పీఎస్‌కు కాలినడకన బయలుదేరింది. మార్గమధ్యంలో స్నేహితుడితో కలిసి ఆటోలో వెళ్తున్న ఓఎస్‌ఏపీ కానిస్టేబుల్‌ దశరథ్‌ నాయక్‌ ఆమెను ఆపి విషయం తెలుసుకున్నాడు. అలాగే..

 తాను సాయం చేస్తానని నమ్మించిన దశరథ్ ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. అయితే అతడు ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లకుండా ఆటోలోనే పలు ప్రాంతాలను తిప్పుతూ చివరికి సహిద్‌నగర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కానిస్టేబుల్ తన ఫ్రెండ్‌తో కలిసి వివాహితపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని కానిస్టేబుల్, అతడి ఫ్రెండ్, ఆటోడ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా డీసీసీ అనూప్‌కుమార్ సాహు ఈ ఘటనపై ఆరా తీసి సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.