Political Updates: ప్రధాని మోదీకి రష్యాకు రమ్మని పుతిన్ ఆహ్వానం

Political Updates: Putin invites PM Modi to visit Russia
Political Updates: Putin invites PM Modi to visit Russia

ప్రధాని నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తమ దేశానికి ఆహ్వానించారు. వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాలని కోరారు. క్లిమ్లిన్లో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో భేటీ అయిన పుతిన్ ఈ మేరకు మోదీకి ఆహ్వానం పలికారు. ఈ భేటీలో పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ సంబంధాలపై పుతిన్తో జైశంకర్ చర్చించారు.

ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ వర్తమాన అంశాలపై చర్చించేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ సంక్షోభం శాంతియుతంగా పరిష్కృతమవ్వాలని మోదీ కోరుకుంటున్న సంగతి తనకు తెలుసని పేర్కొన్నారు. దాని గురించి తామిద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నామని, ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితిపై భారత్‌కు మరింత అదనపు సమాచారం అందజేస్తామని వెల్లడించారు. భారత్‌తో తమ దేశ వాణిజ్య లావాదేవీల్లో వరుసగా రెండో ఏడాది గణనీయ పెరుగుదల నమోదవుతుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.