జిమ్మిక్కి క‌మ్మ‌ల్ న‌చ్చింద‌న్న జిమ్మి కిమెల్

Popular American TV Host Jimmy Kimmel Retweets Mohanlal Jimikki Song.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మోహ‌న్ లాల్ పాట ఒక‌టి భార‌తీయులనే కాదు…ఇత‌ర‌దేశ‌స్థుల‌నూ ఆక‌ర్షిస్తోంది. జిమ్మిక్కి క‌మ్మ‌ల్ అంటూ సాగే ఈ పాట ప్ర‌ముఖ అమెరిక‌న్ టెలివిజ‌న్ హోస్ట్ జిమ్మి కిమెల్ కు చాలా న‌చ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని ఆయనే స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో తెలియ‌జేశారు. జిమ్మిక్కి క‌మ్మ‌ల్ చ‌ర‌ణాలు త‌న పేరు జిమ్మి కిమెల్ ను త‌ల‌పిస్తుండ‌టంతో పాట ఆసాంతం ఆస‌క్తిగా విన్నాన‌ని జిమ్మి చెప్పారు. చ‌ర‌ణాలు అర్ధం కాక‌పోయినాపాట త‌న‌కు చాలా న‌చ్చింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. మోహ‌న్ లాల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన వెలిప‌డింతె పుస్త‌కం సినిమాలోది ఈ పాట‌. ఇందులో యువ‌తీ యువ‌కులు క‌లిసి పాడుతూ డ్యాన్స్ చేస్తూ క‌నిపిస్తారు. ఇది చూసిన విద్యార్థులు కొంద‌రు త‌మ స్ట‌యిల్లో పాట‌కు పేర‌డీగా డ్యాన్స్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కేర‌ళ‌, త‌మిళ‌నాడుల్లో ఈ పాట ఇప్ప‌టికే యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఖండాంత‌రాలు దాటి అభిమానుల‌న్ని సంపాదించుకుంటోంది. కొన్నేళ్ల క్రితం ధ‌నుష్ సాంగ్ వై దిస్ కొల‌వెరి లానే జిమ్మిక్కి క‌మ‌ల్ కూడా ట్రెండ్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు:

‘జై లవకుశ’.. ఇదో రొటీన్‌ సినిమానేనా?

బిగ్‌బాస్‌లో ఆసక్తికర సంఘటన