మలయాళంలోను అదే రెస్పాన్స్‌

Popular producers also compete for Malayalam Dubbing Rights Allu Arjun naa Peru surya movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘నాపేరు సూర్య’ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న విషయం తెల్సిందే. ఇటీవలే విడుదలైన నాపేరు సూర్య పస్ట్‌ ఇంపాక్ట్‌ వీడియోతో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. అల్లు అర్జున్‌ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందనే విషయంపై ఆ వీడియో క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియో విడుదల తర్వాత సినీ వర్గాల్లో కూడా మంచి క్రేజ్‌ ఏర్పడటం జరిగింది. భారీ ఎత్తున బిజినెస్‌ కూడా జరుగుతుంది. ఇప్పుడు తెలుగులో మాదిరిగా మలయాళంలో కూడా ఇంపాక్ట్‌ వీడియోను విడుదల చేయడం జరిగింది. సహజంగానే అల్లు అర్జున్‌కు అక్కడ భారీ స్థాయిలో క్రేజ్‌ ఉంది. ఇప్పుడు ఈ వీడియోతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

మలయాళ డబ్బింగ్‌ రైట్స్‌ కోసం ప్రముఖ నిర్మాతలు సైతం పోటీ పడుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు. తెలుగు, తమిళం, మలయాళంలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. కేవలం సౌత్‌ భాషల్లోనే కాకుండా ఉత్తరాదిన కూడా చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. గతంలో ఏ తెలుగు సినిమా విడుదల కానన్ని థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అల్లు అర్జున్‌కు జోడీగా అను ఎమాన్యూల్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఏప్రిల్‌లో విడుదల కాబోతున్న ఈ చిత్రం అల్లు అర్జున్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలవడంతో పాటు, టాప్‌ టాలీవుడ్‌ చిత్రాల జాబితాలో చేరడం ఖాయం అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.