‘జవాన్‌’కు మెహ్రీన్‌ లక్‌ కలిసి వచ్చింది

positive talk on sai dharam tej and mehreen jawaan movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌, బివిఎస్‌ రవిల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జవాన్‌’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు రవిపై సినీ వర్గాల్లో ఏమాత్రం అంచనాలు లేకపోవడంతో సినిమాపై పెద్దగా ఆసక్తి లేదు. అయితే ఈ చిత్రంలో దిల్‌రాజు, కొరటాలలు వేళు పెట్టారు అంటూ ప్రచారం జరగడంతో సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. దిల్‌రాజు పలు సూచనలు మరియు సలహాలు ఇచ్చి రీ షూట్‌లు చేయించాడు. పైగా ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పించాడు. ఇక కొరటాల శివ స్క్రిప్ట్‌ విషయంలో మరియు కొన్ని సీన్స్‌ విషయంలో సలహాలు ఇచ్చాడు అంటూ సమాచారం. అందుకే ఈ సినిమా బాగుంటుందని అంతా భావించారు.

jawaan-movie

నిన్న విడుదలైన ఈ చిత్రంకు మిశ్రమ స్పందన వస్తుంది. కథ బాగున్నా కూడా దాన్ని నడిపించిన తీరు అంతగా ఆకట్టుకోలేదంటూ కొందరు విమర్శలు గుప్పించారు. అన్నింటి కంటే ఈ చిత్రంలో ముద్దుగుమ్మ మెహ్రీన్‌ అందాలు హైలైట్‌గా నిలిచాయి. లక్కీ బ్యూటీగా గత కొంత కాలంగా వరుసగా సక్సెస్‌లు దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ మెహ్రీన్‌ వల్ల ‘జవాన్‌’ సినిమాకు కూడా కలిసి వచ్చింది. మెహ్రీన్‌ అందాలు, హీరోయిన్‌తో తేజూ రొమాన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. మాస్‌ ఆడియన్స్‌కు మెహ్రీన్‌ అందాల ప్రదర్శణ తెగ నచ్చింది. అందుకే సినిమాకు పాజిటివ్‌ టాక్‌ దక్కింది. మొదటి నుండి కూడా మెహ్రీన్‌ లక్‌ జవాన్‌కు కలిసి వస్తుందని కొందరు భావించారు. అనుకున్నట్లుగానే ఈ సినిమాకు మెహ్రీన్‌ అందాలు హైలైట్‌ అయ్యి సినిమాను కాపాడాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందాల ప్రదర్శణలో ఏమాత్రం అడ్డు చెప్పకుండా మెహ్రీన్‌ అందాలను చూపడంతో తేజూ బయట పడ్డాడు.