జగన్ గెలుపు మొక్కులు తీర్చుకున్న పోసాని

Possani earned the triumph of the Jagan

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించింది. వైసీపీకి అనూహ్యంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్ సభ స్థానాలు దక్కాయి. వైసీపీ చీఫ్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వైసీపీ గెలుపుతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. వైసీపీని, జగన్ ని అభిమానించే వారు సైతం ఆనందంలో ఉన్నారు. జగన్ వీరాభిమాని, నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. జగన్ గెలుపుని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు.

ఏపీలో జగన్ ఘన విజయం సాధించడంతో పోసాని కృష్ణ మురళి శుక్రవారం అమీర్ పేట్ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.  తనకు ఇష్టమైన జగన్ సీఎం కావడం సంతోషంగా ఉందని జగన్ దేశంలోనే నెంబర్ వన్ లీడర్ గా అవతరించారని అన్నారు. జగన్ అవినీతిపరుడు కాదని ప్రజలు నమ్మారని, అందుకే గెలిపించారని పోసాని తెలిపారు. నా జీవితంలో అన్ని కోరికలు తీరిపోయాయని జగన్ కు చంద్రబాబు అభినందనలు తెలిపినందుకు సంతోషమన్నారు. ప్రజల తీర్పు చూసి చంద్రబాబు మారిపోయారనుకుంటున్నానన్నారు. జగన్ పై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారన్నారు. జగన్ పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలన్నారు. జగన్ కి అభినందనలు తెలిపిన చంద్రబాబుకి పోసాని కృతజ్ఞతలు తెలిపారు.