పిక్‌టాక్‌: బాహుబలి నుండి బయట పడ్డట్లే

prabhas new look in saaho movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ‘బాహుబలి’ కోసం ప్రభాస్‌ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ప్రభాస్‌ అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాహుబలిని గుర్తు తెచ్చుకోవడం ఖాయం. బాహుబలి లుక్‌లోనే ప్రభాస్‌ ఎక్కువ ఫేమస్‌ అయ్యాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన పాత్ర కోసం ప్రభాస్‌ తన లుక్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. అమెరికాలో ప్రముఖ శిక్షకుల వద్ద జిమ్‌ చేయడంతో పాటు, కొత్త లుక్‌ను మరియు స్టైల్‌ను అనుసరిస్తూ ప్రభాస్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

తాజాగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ద్వారా బయటకు వచ్చిన ఈ స్టిల్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ‘సాహో’ సినిమాలో కొత్త ప్రభాస్‌ను చూడబోతున్నట్లుగా ఈ స్టిల్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్న బాహుబలి లుక్‌ నుండి ప్రభాస్‌ బయట పడ్డట్లే అని చెప్పుకోవచ్చు.

మరిన్ని వార్తలు

మంచు వారి ఇంటకి మరో బుజ్జాయి

సాయి పల్లవి కోసమైనా చూడాలనిపిస్తుంది

నాగ్‌, నాని మల్టీస్టారర్‌ మూవీ..