సాయి పల్లవి కోసమైనా చూడాలనిపిస్తుంది

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

varun tej fidaa movie latest trailer

మెగా హీరో వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘ఫిదా’. ఈ వారం ప్రేక్షకలు ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపించలేదు. అయితే దిల్‌రాజు తనదైన మైండ్‌ను ఉపయోగించి మరో ట్రైలర్‌లను వదిలాడు. ఆ ట్రైలర్‌తో ప్రేక్షకులు సినిమాను చూడాలని అల్లాడిపోతున్నారు. ఈసారి ట్రైలర్‌లో హీరోయిన్‌ సాయిపల్లవిని హైలైట్‌ చేస్తూ చూపించడం జరిగింది.

మొదటి ట్రైలర్‌లో పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో పాటు, ఒక మూస తరహా సినిమాలా ‘ఫిదా’ ఉంటుంది అనే టాక్‌ వచ్చింది. దాంతో దిల్‌రాజు ప్రత్యేంగా కొత్త ట్రైలర్‌ను కట్‌ చేయించాడు. కొత్త ట్రైలర్‌కు అనూహ్యంగా మంచి స్పందన వచ్చింది. సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్‌ మరియు ఆమె అల్లరి పనులు మరియు వరుణ్‌, సాయి పల్లవిల మద్య రొమాన్స్‌ కోసం వెళ్లాలి అనిపించేలా ట్రైలర్‌ ఉంది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఫిదా’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో భారీగానే ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశాలున్నాయని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశిస్తున్నారు. వరుసగా విజయాలను అందుకుంటున్న దిల్‌రాజు ఈ సినిమాతో మరో సక్సెస్‌ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు

నాగ్‌, నాని మల్టీస్టారర్‌ మూవీ..

డ్రగ్స్‌ కేసు : స్టార్స్‌కు డేట్లు ఇచ్చిన పోలీసులు

చిరు తర్వాత బాలయ్యతో..!