నాగ్‌, నాని మల్టీస్టారర్‌ మూవీ..

nagarjuna and nani multistarrer movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాగార్జున ఇప్పటికే పలు సార్లు మల్టీస్టారర్‌ చిత్రాలు చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అని, మంచి కథతో పాటు తనకు మంచి కోస్టార్‌ను ఎంపిక చేస్తే ఎవరి దర్శకత్వంలో అయినా నటిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ‘ఊపిరి’ చిత్రంలో కార్తీతో కలిసి నటించిన నాగార్జున త్వరలో నానితో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత ప్రసాద్‌ వి పొట్లూరి మరియు దిల్‌రాజులు కలిసి సంయుక్తంగా వీరి కాంబోలో మల్టీస్టారర్‌ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కూడా మల్టీస్టారర్‌కు ఓకే చెప్పారు అనేది సినీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ.

ప్రస్తుతం ఒక యువ దర్శకుడు వీరి కోసం కథను సిద్దం చేస్తున్నాడు. ఆయన చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడంతో నాగార్జున మరియు నానిలు ఒప్పుకున్నారు. పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేసి వచ్చే సంవత్సరం ఆరంభంలో సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. ఇప్పటి వరకు ఆ దర్శకుడు మూడు సినిమాలు చేశాడని, ఆ సినిమాలు ఒక మోస్తరుగా ఆడాయని చెబుతున్నారు. పూర్తి స్క్రిప్ట్‌తో నాగార్జున మరియు నానిని ఆయన ఒప్పిస్తాడా అనేది చూడాలి. భారీ స్థాయిలో ఆ సినిమాపై అంచనాలు వచ్చే అవకాశం ఉంది. ‘ఊపిరి’ చిత్రం తర్వాత నాగార్జున చేయబోతున్న మల్టీస్టారర్‌ చిత్రం కావడం ఇదే. ఈ మల్టీస్టారర్‌ సక్సెస్‌ అయితే టాలీవుడ్‌లో మరిన్ని మల్టీస్టారర్‌లు వస్తాయనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు.

మరిన్ని వార్తలు 

పిక్‌టాక్‌ : మళ్లీ మనస్సు దోచుకుంది

డ్రగ్స్‌ కేసు : స్టార్స్‌కు డేట్లు ఇచ్చిన పోలీసులు

స్టార్‌ హీరోకు 2 లక్షల ఫైన్‌