నా సామిరంగ నుండి రాజ్ తరుణ్ గ్లింప్స్ రిలీజ్

నా సామిరంగ నుండి రాజ్ తరుణ్ గ్లింప్స్ రిలీజ్
Cinema News

టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో, ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ నా సామిరంగ. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానున్నది . ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార మూవీ ల కి ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేయడం జరిగింది. ఈ మూవీ లో యంగ్ నటుడు రాజ్ తరుణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజ్ తరుణ్ ఇందులో భాస్కర్ పాత్రలో నటిస్తున్నారు.

నా సామిరంగ నుండి రాజ్ తరుణ్ గ్లింప్స్ రిలీజ్
Naa Saami Ranga

అయితే రేపు ఈ పాత్రకి సంబందించిన గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. రేపు సాయంత్రం 4:05 గంటలకు గ్లింప్స్ వీడియో రిలీజ్ కానుంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ MM కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, మర్నా మీనన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.