చరణ్‌కు మరే దర్శకుడు దొరకలేదా?

ram charan next movie with trinadha rao nakkina

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘మేం వయస్సుకు వచ్చాం’, ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్‌’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు త్రినాధరావు నక్కినకు ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు యువ హీరోలు పోటీ పడుతున్నారు. అయితే ఆయన మాత్రం ఈసారి ఒక స్టార్‌ హీరోతో సినిమా చేయాలనే పట్టుదలతో కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ కోసం ఒక స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘నేను లోకల్‌’ సినిమా విడుదలైన తర్వాత రామ్‌చరణ్‌ను కలిసిన త్రినాధరావు నక్కినకు చరణ్‌ హామీ ఇచ్చినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. 

త్రినాధరావు నక్కిన చెప్పిన ఒక స్టోరీ లైన్‌కు రామ్‌ చరణ్‌ ఓకే చెప్పాడని, మంచి స్క్రీన్‌ప్లేతో వచ్చినట్లయితే తప్పకుండా సినిమా చేద్దాం అంటూ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు అదే పనిలో ఉన్నాడు. అయితే చరణ్‌తో సినిమా చేయాలి అంటే సంవత్సరం పాటు ఎదురు చూడాల్సి ఉంది. ప్రస్తుతం చేస్తున్న రంగస్థలం చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు చరణ్‌ కమిట్‌ అయ్యాడు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో చరణ్‌ సినిమా చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజం అయితే చరణ్‌తో సినిమా చేయాలి అంటే త్రినాధరావు 2019 వరకు ఎదురు చూడాల్సిందే. మరి అన్ని రోజులు త్రినాధరావు ఎదురు చూస్తాడా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు

డ్రగ్స్‌ కేసు : స్టార్స్‌కు డేట్లు ఇచ్చిన పోలీసులు