పిక్‌టాక్‌ : మళ్లీ మనస్సు దోచుకుంది

prince mahesh babu daughter latest pics in social media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కూతురు సితార సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడు తెగ సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. సితార పలు రకాల డ్రస్‌లలో ప్రేక్షకుల మనస్సు దోచుకుంటూ ఉంటుంది. తాజాగా మరోసారి సితార సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా సితార ఏదో ఒక ఫొటో ఉంటూనే ఉంటుంది. ఇటీవల ‘స్పైడర్‌’ చిత్రం షూటింగ్‌ సెట్స్‌కు వెళ్లిందేమో అక్కడ చిత్ర యూనిట్‌ సరదగా గడిపింది. ఆ సమయంలోనే మహేష్‌బాబు మరియు హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేశాయి.

తాజాగా సితార మరో కొత్త ఫొటోతో సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది. ఈసారి పక్కా ట్రెడీషనల్‌ అమ్మాయిగా ఆకట్టుకుంటుంది. లంగా జాకీటుతో చిన్న ఒడ్డానం పొడవాటి జడతో ముద్దు ఒలుకుతూ సితార ఆకట్టుకుంటూ ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంది. ఈనె 20న సితార బర్త్‌డే ఉంది. ఈ సందర్బంగా మహేష్‌బాబు ఫ్యామిలీ మెంబర్స్‌ ఈ ఫొటోను విడుదల చేసి ఉంటారు. సితార బర్త్‌డే వేడుకను వైభవంగా జరుపుకునేందుకు ఫ్యాన్స్‌ సిద్దం అవుతున్నారు.

మరిన్ని వార్తలు

నాని అప్పుడే డేట్‌ ఫిక్స్‌ చేశాడు

బిగ్‌బాస్‌ : సంపూ ది లీడర్‌