మెగా మూవీని చుట్టేశారా?

sai dharam tej jawan movie shooting completed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా మెహ్రీన్‌ హీరోయిన్‌గా బివిఎస్‌ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జవాన్‌’. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఇంతలోనే ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. క్లైమాక్స్‌ చిత్రీకరణ పూర్తి అయితే సినిమా పూర్తి అయినట్లే అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా అధికారికంగా ప్రకటించారు. అయితే సినిమా ఇంత త్వరగా పూర్తి అవ్వడంపై మెగా ఫ్యాన్స్‌ మరియు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో రవి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాంటెడ్‌’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాంతో ఈ రచయిత కం దర్శకుడితో సినిమాను చేసేందుకు ఏ హీరో కూడా ముందుకు రాలేదు. అయితే మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ మాత్రం ఆయనపై నమ్మకం పెట్టి సినిమాను చేశాడు. సినిమాపై అంచనాలు ఏమాత్రం లేవు. పైగా ఈ సినిమా తక్కువ సమయంలోనే మడతెట్టేశారు. దాంతో సినిమా ఎలా ఉంటుందో అనే అనుమానాలు ఫ్యాన్స్‌లో వ్యక్తం అవుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు అనే టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటికే ‘విన్నర్‌’ చిత్రం ఫ్లాప్‌తో ఢీలా పడిపోయిన సాయి ధరమ్‌ తేజ్‌ ఈ సినిమా కూడా ఫ్లాప్‌ అయితే మరింత కష్టాలను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు 

బిగ్‌బాస్‌ : సంపూ ది లీడర్‌

పూరి నోరు విప్పితే టాలీవుడ్‌ షేక్‌..!

నాని అప్పుడే డేట్‌ ఫిక్స్‌ చేశాడు