మంచు వారి ఇంటకి మరో బుజ్జాయి

manchu vishnu will become father again

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టైటిల్‌ చూడగానే మంచు మనోజ్‌ తండ్రి కాబోతున్నాడా అనే అనుమానం రావచ్చు. మీ అనుమానం తప్పు. విషయం ఏంటి అంటే మంచు విష్ణు మళ్లీ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు పేర్కొన్నాడు. ఇప్పటికే మంచు విష్ణుకు ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెల్సిందే. వారు కవల పిల్లలు. ఇప్పుడు మంచు విష్ణు భార్య వెరోనిక గర్బవతి. ఆమె త్వరలోనే మరో బిడ్డ కి జన్మనివ్వబోతుంది.

ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన మంచు విష్ణు తాను మళ్లీ తండ్రిని కాబోతున్నట్లుగా చెప్పకనే చెప్పాడు. ఈ ఫొటోను షేర్‌ చేసి మంచు లక్ష్మి తన సోదరుడికి శుభాకాంక్షలు చెప్పింది. ప్రస్తుతం వెరోనిక విదేశాల్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మంచు విష్ణు కూతుర్లు అరి, విరిలు అమెరికాలో పుట్టారు. త్వరలో పుట్టబోతున్న మరో బిడ్డ కూడా అమెరికాలోనే పుట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు పాపలు ఉన్న మంచు విష్ణుకు బాబు కావాలనే కోరిక ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులు కూడా బాబునే కోరుకుంటూ ఉంటారు.

మరిన్ని వార్తలు 

సాయి పల్లవి కోసమైనా చూడాలనిపిస్తుంది

స్టార్‌ హీరోకు 2 లక్షల ఫైన్‌

నాగ్‌, నాని మల్టీస్టారర్‌ మూవీ..