ఆరోజు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడట…!

Prabhas Plans A Surprise For Fans On His Birthday

ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఇప్పటికే అభిమానులు రెడీ అయిపోయారు. ఈ సందర్భంగా తమ అభిమానులకు ఓ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. ‘అందరికీ దసరా శుభాకాంక్షలు. మీ అందరికీ ఈ నెల 23న ఓ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నా. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది’ అంటూ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. తన తాజా చిత్రం ‘సాహో’ టీజర్ ను ఆ రోజు విడుదల చేయవచ్చని అభిమానులు భావిస్తున్నారు.

sahooo.
ప్రభాస్ తాజా చిత్రంగా ‘సాహో’ రూపొందుతోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాపైనే ప్రభాస్ అభిమానులంతా దృష్టి పెట్టారు. అందుకే ”సాహో’ టీజర్ ను వదలవచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఆ మధ్య దుబాయ్ లోని ‘బూర్జ్ ఖలీఫా’ ప్రాంతంలో 25 కోట్లతో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఈ సినిమాకి ఈ యాక్షన్ సీన్ హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. లేదా ఈ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన మేకింగ్ వీడియోను ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. మారి పుట్టినరోజున ప్రభాస్ ఏమి విడుదల చేయనున్నాడో ఆ రోజు దాకా వేచి చూడక తప్పదు.

Sahoo movie