భాగ‌మ‌తిపై బాహుబ‌లి ప్ర‌శంస‌ల జ‌ల్లు

Prabhas React To Anushka Bhagmati trailer
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అనుష్క తో త‌నకు ఎలాంటి అనుబంధం లేదంటూనే వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాడు ప్ర‌భాస్. అనుష్క టైటిల్ రోల్ లో న‌టించిన భాగ‌మ‌తి ట్రైల‌ర్ విడుద‌ల‌యిన సంద‌ర్భంగా మ‌రోసారి స్వీటీని ప్ర‌శంసించాడు బాహుబ‌లి. ట్రైల‌ర్ ను ఫేస్ బుక్ లో షేర్ చేసిన ప్ర‌భాస్ అనుష్క న‌ట‌నను మెచ్చుకున్నాడు. ట్రూ హాడ్ వ‌ర్క్, డెడికేష‌న్. స్వీటీకి, అశోక్ కి, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌కి గుడ్ ల‌క్ అని ప్ర‌భాస్ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌లైన‌ప్పుడు కూడా ప్ర‌భాస్ అనుష్క‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. ప్ర‌తి సినిమాలో కొత్త‌గా ప్ర‌య‌త్నించ‌డంలో ఆమె తొలి వ‌రుస‌లో ఉంటారు. స్వీటీ, యూవీ క్రియేష‌న్స్ టీంకు అభినంద‌న‌లు అన్నారు.

prabhash-about-anushka-shet

బాహుబ‌లి త‌ర్వాత అనుష్క న‌టించిన భాగ‌మ‌తిపై భారీ అంచ‌నాలున్నాయి. అందుకు త‌గ్గ‌ట్గుగా ట్రైల‌ర్ విడుద‌లైన మూడు గంట‌ల్లోనే 20ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ముకుంద‌న్, జ‌య‌రాం, ముర‌ళీ శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. యూవీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వంశీ, ప్ర‌మోద్ లు భాగ‌మ‌తిని నిర్మించారు. జ‌న‌వ‌రి 26న ఈ సినిమా విడుద‌ల కానుంది. బాహుబలి త‌ర్వాత ప్ర‌భాస్, అనుష్క లిద్ద‌రూ యూవీ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లోనే న‌టిస్తుండ‌డం విశేషం. ప్ర‌భాస్ సాహో సినిమాను కూడా యూవీ క్రియేష‌న్సే నిర్మిస్తోంది. తొలుత సాహోలో హీరోయిన్ గా అనుష్క‌నే అనుకున్న‌ప్ప‌టికీ..త‌ర్వాత శ్ర‌ద్ధాక‌పూర్ ను తీసుకున్నారు.