అనుష్కకు ప్రభాస్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చాడు.. అదేంటో తెలిస్తే షాక్‌

Prabhas Special Gift To Anushka Shetty On Her Birthday

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, టాలీవుడ్‌ స్వీటీ అనుష్కలు ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఇటీవలే ఒక ప్రముఖ మీడియా వ్యక్తి ఇద్దరి మద్య ప్రేమ ఉందని, ఇద్దరు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. కాని ఆ వార్తలను ప్రభాస్‌ సన్నిహితులు కొట్టి పారేశారు. మీడియాలో వస్తున్న వార్తలను కొట్టి పారేస్తున్నా కూడా వారు చేస్తున్న పనులు, వారిద్దరి మద్య ఉన్న సన్నిహిత్యంను చూస్తుంటే ఇద్దరు డీప్‌ ప్రేమలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవలే ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్బంగా అనుష్క చాలా ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చిన విషయం తెల్సిందే. 

అనుష్కకు ప్రభాస్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చాడు.. అదేంటో తెలిస్తే షాక్‌ - Telugu Bullet

ప్రత్యేకంగా రెడీ చేయించిన వాచ్‌తో ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. తాజాగా అనుష్క పుట్టిన రోజు జరుపుకుంది. ఆమె ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినప్పుడు ప్రభాస్‌ ఊరుకుంటాడా.. అనుష్క ఇచ్చిన గిఫ్ట్‌ కంటే చాలా ఖరీదైన గిఫ్ట్‌ను ప్రభాస్‌ ఇచ్చాడు. ప్రముఖ కంపెనీ కారును అనుష్క కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేయించి ప్రభాస్‌ విదేశాల నుండి తెప్పించాడని, ఆ కారును తన గుర్తుగా, తన ప్రేమ గుర్తుగా అనుష్కకు ప్రభాస్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. ఇద్దరు ఇంత ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చుకుంటు, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటూ ఇద్దరి మద్య ప్రేమ లేదంటే ఎలా నమ్ముతాం చెప్పండి. ఆయన అన్నట్లుగా ఇద్దరి మద్య ప్రేమ ఉంది, ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో వీరి వివాహం జరుగబోతుంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు అంటూ సినీ వర్గాల వారు బల్ల గుద్దుతున్నారు.