కరుణానిధి ఎన్టీఆర్ అవుతాడా ?

prakash raj plays NTR role in Lakshmi's NTR movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
” లక్ష్మీస్ ఎన్టీఆర్ ” పేరుతో సినిమా అనౌన్స్ చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇక కాస్టింగ్ విషయంలో దృష్టి పెట్టాడు. ఈ సినిమాకి వెన్నుముక లాంటి ఎన్టీఆర్ క్యారెక్టర్ ని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో వేయించాలని వర్మ ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగం గానే సినిమా నిర్మాత, వైసీపీ నేత రాకేష్ రెడ్డి ని వెంటబెట్టుకుని ప్రకాష్ రాజ్ ని కలిసేందుకు బెంగుళూరు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యాయట. అయితే ఎన్నో వివాదాలతో కూడుకున్న ఈ సినిమా చేయడానికి ప్రకాష్ రాజ్ ఎంతవరకు ఒప్పుకుంటాడు అన్నదే కీలకం. ప్రకాష్ కి స్టోరీ , క్యారెక్టర్ నచ్చితే ఈ సినిమా చేయడానికి రెడీ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే …

మణిరత్నం తమిళ్ లో ఎంజీఆర్ , కరుణానిధి ల మధ్య స్నేహం, వైరం కథ గా తీసిన ఇరువురు గురించి తెలిసిందే. తెలుగులో ఇద్దరు గా వచ్చిన ఈ సినిమా మీద అప్పట్లో తమిళనాట ఇంతకు మించిన చర్చ జరిగింది. సినిమా రిలీజ్ అయితే డీఎంకే, అన్నాడీఎంకే మధ్య అల్లర్లు చెలరేగుతాయని కూడా అనుకున్నారు. అయితే అదేమీ జరక్కుండా మణిరత్నం ఆ సినిమా తీసి చూపించారు. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినా నటన పరంగా ఎంజీఆర్ పాత్ర వేసిన మోహన్ లాల్ , కరుణానిధి పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రకి పాత్రకి ప్రకాష్ రాజ్ ఒప్పుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రుల నిజ జీవిత పాత్రల్ని ఆయన పోషించినట్టు అవుతుంది. సిల్వర్ స్క్రీన్ కరుణానిధే వెండితెర ఎన్టీఆర్ అయిపోతాడు.