Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ ని అడ్డం పెట్టుకుని బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాజకీయ నాటకాలు ఆడుతోందని చెప్పేందుకు ఇది తాజా ఉదాహరణ. పీఎంఓ లో వైసీపీ ఎంపీ విజయసాయి కనిపిస్తే తప్పేంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్న తరుణంలోనే ఇద్దరి మధ్య బంధాన్ని బయటపెడుతూ ఇంకో ఎపిసోడ్ కి ఢిల్లీ వేదిక అయ్యింది. టీడీపీ అవిశ్వాసం పెట్టాక పరిస్థితుల మీద చర్చించడానికి రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఢిల్లీకి పిలిపించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఆ మీటింగ్ కి ఏపీ బీజేపీ నాయకులతో పాటు ఇంకో కీలక వ్యక్తి హాజరు అయ్యారు. ఆయనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్.
ప్రశాంత్ కిషోర్ ని అమిత్ షా పక్కన చూసిన బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు. జగన్ తో బీజేపీ లోపాయికారీగా వ్యవహారం నడుపుతోంది అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది ? తాజా పరిణామాల మీద వైసీపీ తరపున సర్వే నిర్వహించిన ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారో వివరించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం బీజేపీ తో పాటు ఆ పార్టీ తో అంట కాగుతున్న వైసీపీ, పవన్ మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ప్రశాంత్ కిషోర్ వివరించారట. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి అధిగమించడానికి ఏమి చేయాలో అని అమిత్ షా బృందం బుర్రలు బద్దలు కొట్టుకొంటోంది.