ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఈనెల 11న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రం ఎన్టీఆర్ గత చిత్రాలతో పోల్చితే భారీ ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లో కూడా రికార్డు స్థాయి ధర పలికినట్లుగా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ కాంబో కోసం ప్రేక్షకులు భారీ ఎత్తున ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ కారణంగా ఈచిత్రంకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ చిత్రంను అత్యధిక మొత్తాలకు కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది.