బిడ్డను కనలేనంటూ యువతి బలవన్మరణానికి విఫల యత్నం

ఆంధ్రప్రదేశ్ లో ఘోరం జరిగింది. బిడ్డను కనడం ఇష్టం లేక ఓ గర్భిణి అఘాయిత్యానికి పాల్పడింది. అబార్షన్‌కు కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో బలవంతంగా ప్రాణాలు విడిచేందుకు రెడీ అయింది. కడుపులో బిడ్డతో పాటు ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించింది. విషం తాగి బలవన్మరణానికి తీవ్రంగా ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు అది గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణమైన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగంది.

అసలేం జరిగింది అంటే… కురబలకోట మండలం మట్లివారిపల్లెకి చెందిన మధుకర్‌కి అదే ప్రాంతానికి చెందిన జ్యోతితో పెళ్లైంది. వారికి ఏడాదిన్నర పాప కూడా ఉంది. ఈ మధ్యనే జ్యోతి మరోసారి గర్భం దాల్చింది. ప్రస్తుతం మూడో నెల. అయితే బిడ్డని కనడం ఇష్టం లేని ఆమె అబార్షన్‌కి యత్నించింది. అది తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా మందలించారు. అబార్షన్ కు ఒప్పుకోలేదన్న కోపంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. పొలం వద్ద జిల్లేడు పాలు తాగేసింది. కడుపులో బిడ్డతో పాటు బలవన్మరణానికి యత్నించింది. జిల్లేడు పాలు తాగినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.