అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ జంట

అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ జంట

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కోరలు చాస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చాయి. దీంతో దినసరి కూలీల, వలస జీవుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో కరోనా పోరుకు సెలబ్రిటీలంతా బడుగులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌కు సంబంధించిన స్టార్స్‌తో పాటు క్రీడాకారులు సైతం ప్రధాని సహాయ నిధికి విరాళాలు సంగతి తెలిసిందే. ఇక గ్లోబల్‌ జంట ప్రియాంక చోప్రా, నిక్‌జోనస్‌లు కూడా పలు స్వచ్చంద సంస్థలకు విరాళాలు ఇచ్చినట్లు సోషల్‌ మీడియాలో మంగళవారం ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడమే కాకుండా తన అభిమానులను, అనుచరులను కూడా తగినంత విరాళం ఇవ్వాల్సిందిగా ఆమె కోరారు.

‘ప్రస్తుతం ప్రపంచానికి మన సాయం చాలా అవసరం. ప్రపంచంలోని స్వంచ్చంద సంస్థలన్ని కోవిడ్‌-19పై పోరాడేందుకు జీతం లేని వారిని, తక్కువ జీతం ఉన్నవాళ్లకు, ఇళ్లు లేని వారికి, అదే విధంగా ఈ గడ్డు కాలంలో ప్రథమ పౌరులుగా సేవలందిస్తున్న డాక్టర్లకు, దినసరి కూలీలకు, సినీ పరిశ్రమకు సంబంధించిన చిన్న చిన్న ఆర్టిస్టులను, మన తోటి ఉద్యోగులను ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నాయి. అదే విధంగా ‘‘వాళ్లకు మీ మద్దతు చాలా ముఖ్యం. అలాగే మేము కూడా విరాళం ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఈ  పోస్టులో ఆ సంస్థలకు సంబంధించిన ప్రతి లింక్‌ను షేర్‌ చేశాను. విరాళం ఇవ్వడమంటే చిన్న విషయం కాదు. ప్రపంచాన్ని ఓడించడానికి మనం కలిసి సహాయపడదాం రండి’’