రివర్స్ డ్రామా: పోలీసులను బెదిరించిన ఒక నిందితుడు.

ఓ పక్క కరోనా మరో పక్క హత్యలు సమాజంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. సమాజం ఎటుపోతుంది అనేది అర్థం కానీ పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. తాజాగా హైదరాబాద్ అబిడ్స్ లో  ఆత్మహత్య చేసుకోవాడానికి యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన షాహినాత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చుడిబజార్‌లో చోటు చేసుకుంది.

అయితే ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌పాషా తెలిపిన వివరాల ప్రకారం… చుడిబజార్‌లో నివాసం ఉండే పాపాలాల్‌కు స్థానికంగా ఉండే బస్తీవాసులకు కొన్నిరోజులుగా గొడవులు జరుగుతున్నాయి. 15రోజుల క్రితం ఓ మహిళల పై పాపాలాల్‌ దాడి చేశాడు. ఆ తర్వాత ఓమహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాపాలాల్‌ పై 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అంతేకాకుండా వారం రోజుల క్రితం మరో మహిళ పాపాలాల్‌ పై ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. దీంతో ఈ రెండు కేసుల్లో పాపాలాల్‌ను విచారించేందుకు ఈనెల 28వ తేదీన షాహినాత్‌గంజ్‌ పోలీసులు పాపాలాల్‌ ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసి పాపాలాల్‌ ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే పాపాలాల్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా పాపాలాల్‌ పై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 12 కేసులు నమోదైనట్లు ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌పాషా స్పష్టం చేశారు. తాజాగా మరో కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.