క‌ర్నాట‌కంలో ఊహించ‌ని ట్విస్ట్… బ‌ల‌ప‌రీక్ష‌కు ముందే య‌డ్యూర‌ప్ప రాజీనామా…?

Priyanka Chaturvedi Release Audio clip of Yeddyurappa and BC Patil,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

క‌ర్నాట‌కం ప‌రిణామాలు క్ష‌ణ‌క్ష‌ణానికీ మారిపోతున్నాయి. తాజాగా బ‌ల‌ప‌రీక్ష‌కు ముందే యడ్యూర‌ప్ప రాజీనామా చేయనున్న‌ట్టు క‌ర్నాట‌క, జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. స‌భ‌లో బ‌లం నిరూపించుకోలేని ప‌రిస్థితి వ‌స్తే..య‌డ్యూర‌ప్ప అంత‌కు ముందే సీఎం ప‌దవికి రాజీనామా చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. విశ్వాస‌ప‌రీక్ష‌కు ముందే స‌భ‌లో మాట్లాడి య‌డ్యూర‌ప్ప గ‌వ‌ర్న‌ర్ ను క‌లుస్తార‌ని జాతీయ మీడియా చెబుతోంది. శుక్ర‌వారం గాలి, ఇవాళ య‌డ్యూర‌ప్ప త‌మ ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ‌పెడుతున్నార‌ని ఆరోపిస్తూ కాంగ్రెస్ టేపులు విడుద‌ల చేసిన నేప‌థ్యంలో పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి తీసుకురావ‌ద్ద‌ని ప్ర‌ధాని సూచించిడంతో కొత్త ముఖ్య‌మంత్రి రాజీనామా లేఖ‌ను సిద్ధం చేసుకున్నట్టు స‌మాచారం. అటు కాంగ్రెస్ విడుద‌ల చేసిన టేపులు రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. డ‌బ్బు, మంత్రి ప‌ద‌వి ఆశ‌చూపి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ ను లొంగ‌దీసుకునేందుకు య‌డ్యూర‌ప్ప జ‌రిపిన ఫోన్ సంభాష‌ణ బీజేపీ కుయోక్తుల‌ను బ‌హిరంగం చేసింది. య‌డ్యూర‌ప్ప‌, పాటిల్ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఇది..
య‌డ్యూర‌ప్పః హ‌లో…హ‌లో..హ‌లో.. ఎక్క‌డున్నావ్…?
బీసీ పాటిల్ః మేము బ‌స్సులో కొచ్చి వెళ్తున్నాం
య‌డ్యూర‌ప్పః కొచ్చి వెళ్ల‌కు. ఇక్క‌డ‌కి వ‌చ్చెయ్…మంత్రి ప‌ద‌వి ఇస్తాం..మాట్లాడుదాం. వెన‌క్కి వ‌చ్చేయ్..
బీసీ పాటిల్ః మొద‌టే నాకు చెప్పి ఉంటే బాగుండేది.ఇప్పుడు బ‌స్సులో ఉన్నాం
య‌డ్యూర‌ప్పః ఏదో కార‌ణం చెప్పి వెన‌క్కి వ‌చ్చేయ్..ఇంట్లోవాళ్ల‌కు స‌మ‌స్య ఉంద‌ని చెప్పి వెన‌క్కి వ‌చ్చేయ్.
బీసీ పాటిల్ః ఇక ముందు నా పొజిష‌న్ ఏంటి?
య‌డ్యూర‌ప్పః నువ్వు మంత్రి అవుతావ్..
బీసీ పాటిల్ః నాతో పాటు ఇద్ద‌రు, ముగ్గురు ఉన్నారు.
య‌డ్యూర‌ప్పః వాళ్ల‌ను కూడా పిలుచుకుని రా…ఇంకా ఏమైనా కావాలంటే శ్రీరాముల‌తో మాట్లాడ‌తా…
బీసీ పాటిల్ః అలాగే అన్నా…
య‌డ్యూర‌ప్పః ఏం చేద్దామ‌నుకుంటున్నావ్..?
బీసీ పాటిల్ః మీరు చెప్పిన‌ట్టే చేద్దాం. ఐదు నిమిషాల్లో మ‌ళ్లీ ఫోన్ చేస్తా…
కాంగ్రెస్ ప్ర‌తినిధి ప్రియాంక చ‌తుర్వేది ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన ఈ ఆడియోపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నాయి.