పవన్ పై ప్రియాంక మోహన్ సంచలన కామెంట్స్..?

పవన్ పై ప్రియాంక మోహన్ సంచలన కామెంట్స్..?
Cinema News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజి (దే కాల్ హిమ్ ఓజి). ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. తాజాగా ఈ హీరోయిన్ మూవీ పై మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.

పవన్ పై ప్రియాంక మోహన్ సంచలన కామెంట్స్..?
Priyanka Mohan

ఓజి మూవీ చాలా బాగా వస్తుంది అని, మీరంతా ఆ మ్యాజిక్ ని స్క్రీన్ పై విట్ నెస్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ, అతను ఒక లెజెండ్, అమేజింగ్ హ్యుమన్, మరియు గ్రేట్ లీడర్ అని అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తేగా వైరల్ అవుతున్నాయి. సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తుండగా, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.