అంబర్‌పేట డీడీకాలనీలో పంజాబీ కుటుంబం ఆత్మహత్యాయత్నం

punjab family attempted suicide in amberpet

హైదరాబాద్: అంబర్‌పేటలోని డీడీకాలనీలో పంజాబీ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. కుల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు వేసుకొని కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా.. కుమారుడు, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పవన్ కర్బంద, నీలం కర్బందగా గుర్తించారు. అపస్మారకస్థితిలో ఉన్న కుమారుడు నిఖిల్, కుమార్తె మన్నును గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులుగా ఇంట్లో అలికిడి లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులే పంజాబీ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు.