విజయ్‌ వెంట పడుతున్న పూరి?

Puri Jagannath gets a script ready for Vijay Devarakonda

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ఈమద్య కాలంలో తన ప్రాభవంను కోల్పోయాడు. చేసిన సినిమాలు అన్ని కూడా వరుసగా ఫ్లాప్‌ అవుతున్న కారణంగా ఈయనతో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలు మాత్రమే కాకుండా చిన్న హీరోలు కూడా ఆసక్తి చూపించడం లేదు. ఇటీవల కొడుకు ఆకాష్‌తో ‘మెహబూబా’ అనే చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దర్శకుడు పూరి ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ కోసం కథను సిద్దం చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ చాలా బిజీగా ఉన్నాడు. ఆయన చేతిలో అయిదు సినిమాలు ఉన్నాయి. అయినా కూడా కోట్లు పట్టుకుని నిర్మాతలు అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ సమయంలోనే వర్మ సాయంతో విజయ్‌కి పూరి గాలం వేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

Puri-Jagannath-gets-a-scrip

రామ్‌ గోపాల్‌ వర్మ అంటే విజయ్‌కు గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే అర్జున్‌ రెడ్డి చిత్రం తర్వాత వర్మను విజయ్‌ కలిసిన విషయం తెల్సిందే. ఇక తాజాగా పూరి తయారు చేసిన కథను వినాల్సిందిగా విజయ్‌కి వర్మ సూచించబోతున్నట్లుగా తెలుస్తోంది. పూరి పూర్తి స్థాయిలో స్క్రిప్ట్‌ను సిద్దం చేసిన తర్వాత స్వయంగా విజయ్‌ను వర్మ కూర్చోబెట్టి పూరితో కథ చెప్పించబోతున్నట్లుగా సినీవర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను తెరకెక్కించిన పూరి మునుపటి ఫాంలోకి వచ్చి రెడీ చేసిన విజయ్‌ను ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి విజయ్‌ ప్రయత్నాలు ఎంత మేరకు సఫలం అవుతాయో చూడాలి.

Puri-Jagannath-gets-a-scrip