రాహుల్ గాంధీ విలాపం ఎందుకు..?

rahul gandhi fails in saving cm nithish and lalu prasad yadav alliance

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాహుల్ ఓ పరిణతి చెందిన రాజకీయ నేతగా సాధించిన తొలి విజయం బీహార్లో బద్ధశత్రువులైన లాలూ, నితీష్ ను కలపడం. అయితే ఇక్కడ లాలూదే కీలక పాత్ర అయినా.. పెద్దమనిషిగా రాహుల్ తన బాధ్యతలు సరిగానే నిర్వహించారు. తేజస్వి విషయంలో రాహుల్ ముందే చెప్పినా లాలూ అనవసర పట్టుదలకు పోయి ఇప్పుడు అసలుకే ఎసరు తెచ్చుకున్నారు.

ఓ దశలో కూతురు మీసా భారతిని డిప్యూటీ సీఎం చేయాలని భావించినా.. ఆమెపైనా సేబీఐ దాడులు జరగడంతో వెనక్కుతగ్గారు. చివరకు బీజేపీ వ్యూహంలో లాలూ బాగానే చిక్కుకున్నారు. ఆయన అహం మీద దెబ్బకొట్టిన బీజేపీ.. రాజీనామాకు ఒప్పుకుంటే తప్పు చేసినట్లేనని ఒత్తిడి పెంచింది. ఈ దెబ్బకు లాలూ అధికారం కోల్పోక తప్పలేదు.

రాహుల్ కూటమిని కలిపి ఉంచడానికి తీవ్రంగా ప్రయత్నించినా ఫెయిలయ్యారు. చివరకు సోనియా కలగజేసుకున్నా కూటమి నిలవలేదు. ఇప్పుడు నితీష్ బీజేపీతో జట్టు కడితే అది విపక్షాలకు కోలుకోలేని దెబ్బ అవుతుంది. అప్పుడు 2019 ఎన్నికల్లో మోడీకి మరింత ఈజీ అవుతుంది. కాంగ్రెస్ ఇంకా బలహీనపడి అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి రావచ్చు.

మరిన్ని వార్తలు:

టాలీవుడ్.. ఛలో అమరావతి

జియోతో ముకేష్ గొయ్యి తవ్వుకున్నారా..?

రాష్ట్రపతి కోవింద్ కు ప్రధాని మోడీ సూచనలు