పండుగల స్పెషల్ రైళ్లు నడపనున్న రైల్వేశాఖ…ఇవే…!

Railways To Run Special Trains
దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లను కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌, సంత్రాగచి – చెన్నై మధ్య నడపనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా అక్టోబరు 12 నుంచి ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ మేరకు రైల్వేశాఖ షెడ్యూలును కూడా ప్రకటించింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి..
trains
‘కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌’
02715 నెంబర్‌ గల కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌ రైలు అక్టోబరు 21న సాయంత్రం 6 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.40కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
‘సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌’
82716 నెంబర్‌ సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌ రైలు అక్టోబరు 22న ఉదయం 5.50 గంటలకు హైదరాబాదులో బయలుదేరి, సాయంత్రం 6 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌ల మీదుగా రాకపోకలు సాగుతాయి.
‘సంత్రాగచి – చెన్నై సెంట్రల్‌’
spl-trains
02841 నెంబర్‌ గల సంత్రాగచి – చెన్నై సెంట్రల్‌ రైలు అక్టోబరు 12, 19, 26, నవంబర్‌ రెండు తేదీల్లో సంత్రాగచిలో మధ్యాహ్నం 12.40కు బయలుదేరి చెన్నై సెంట్రల్‌కు మరుసటి రోజు సాయంత్రం 4.20కు చేరుకుంటుంది.
‘చెన్నై సెంట్రల్‌ – సంత్రాగచి’
02842 నెంబర్‌ గల చెన్నై సెంట్రల్‌ – సంత్రాగచి రైలు అక్టోబరు 13, 20, 27, నవంబర్‌ 3న తేదీల్లో సాయంత్రం 6.20కు చెన్నైలో బయలుదేరి సంత్రాగచికి మరుసటి రోజు రాత్రి 11.30కు చేరు కుంటుంది.