రానున్న 36 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు !

Rain Alert For Telangana For 36 Hours

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 36 గంటల్లో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు.

Rain In Hyderabad

రుతుపవనాల వెనక్కి పోవడంతో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.2 డిగ్రీలు పెరిగాయన్నారు. ఉష్ణోగ్రతల ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 10 నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. రాగాల రెండు రోజుల్లో రాజస్థాన్‌తోపాటు ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు అక్టోబర్ 10నాటికి తెలంగాణలో రుతుపవనాలు వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి సెప్టెంబర్ మొదటివారం నుంచే రుతుపవనాల తిరోగమనం ప్రారంభం కావాలని కానీ దాదాపుగా నాలుగు వారాలు ఆలస్యంగా రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. రుతుపవనాల తిరోగమనం పూర్తయ్యేదాకా రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.