‘ఆర్‌’ మల్టీస్టారర్‌ పుకార్లపై క్లారిటీ

Rajamouli multi-starrer movie is not a remake says producer danayya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజమౌళి మల్టీస్టారర్‌ మూవీ మెల్ల మెల్లగా పనులు జరుపుకుంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు ఎలా కనిపించబోతున్నారు అనేది గత కొంత కాలంగా జరుగుతున్న చర్చ. ఈ మల్టీస్టారర్‌ గురించి రోజుకు ఒక వార్త చొప్పున మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ చిత్రం గురించిన వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌లో చాలా కాలం క్రితం వచ్చిన ‘కరణ్‌ అర్జున్‌’ చిత్రానికి ఇది రీమేక్‌ అని, రీమేక్‌ రైట్స్‌ కూడా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. రీమేక్‌లా కాకుండా స్టోరీ లైన్‌ మాత్రమే తీసుకుని దాని చుట్టు కథ అల్లబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మీడియాలో వస్తున్న వార్తలను నిర్మాత దానయ్య కొట్టి పారేశాడు. మల్టీస్టారర్‌ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబోతున్న ఈయన తాజాగా మీడియాలో వస్తున్న వార్తపై క్లారిటీ ఇచ్చాడు. బాలీవుడ్‌ సినిమాకు ఈ మల్టీస్టారర్‌ రీమేక్‌ అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు అలాంటి ఆలోచనే లేదు అంటూ పేర్కొన్నాడు. సినిమా ప్రారంభంకు ముందు ప్రెస్‌మీట్‌ పెట్టి అన్ని విషయాలను వెళ్లడిస్తామని ప్రకటించాడు. దానయ్య ప్రకటనతో ఈ చిత్రం ‘కరణ్‌ అర్జున్‌’కు రీమేక్‌ కాదని క్లారిటీ వచ్చింది. ఇక ఈ చిత్రంలో చరణ్‌, ఎన్టీఆర్‌ మరి ఎలా నటిస్తారా అంటూ మళ్లీ చర్చ మొదలైంది. సినిమాను వచ్చే సంవత్సరం చివర్లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. రాజమౌళి ‘బాహుబలి’ స్థాయిలోనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం అల్యూమీనియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో భారీ సెట్టింగ్‌ల నిర్మాణం ప్రారంభం అయ్యింది