రాజమౌళి ప్రెస్ మీట్…ఏమంటారో ?

Rajamouli Press Meet On 14th

రాజమౌళి ఆర్ఆర్ ఆర్ సినిమా గురించి ఏ మాత్రం బయటకు రానియ్యడం లేదు. ఇప్పటికి రెండు షేడ్యూల్స్ పూర్తయ్యాయి కానే ఆ సినిమా టైటిల్ కాని పాత్రల తీరు, లేదా కథాంశం, ఏదీ కూడా ఇప్పటికి బయట పెట్టలేదు అంతా మిస్టరీగానే ఉంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఈరోజు వరకూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తూనే ఉన్నాయి. సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర రాబిన్‌హుడ్‌ తరహాలో నెగెటివ్‌ షేడ్స్‌లో ఉంటుందని కొందరు, రామ్‌చరణ్‌ పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారని బ్రిటిష్‌ కాలం నాటి కథ అని, ప్రభాస్‌ కూడా అతిథి పాత్రలో మెరుస్తారని ఇంకొందరు రాశారు.

ఇక ఇందులో బాలీవుడ్‌లోని టాప్‌ హీరోయిన్స్‌ నటిస్తున్నారని ఇలా రోజుకో వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. దీనికంతటికి ఓ పుల్‌స్టాప్ పెట్టాలనీ రాజమౌళి అనుకుంటున్నాడు. అందులో భాగంగా..ఆయన ఈ సినిమా పూర్తి విశేషాలు..హీరోయిన్స్ నుండి…సినిమా పేరు వరకు వెల్లడించనున్నారు. దానికి కూాడా..ఓ మూహుర్తం ఫిక్స్ చేశాడు రాజమౌళి. వీటన్నింటికీ మార్చి 14న రాజమౌళి సమాధానం చెబుతారని సమాచారం. ఆరోజు మీడియాతో ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.