‘2.0’ అప్‌డేట్స్‌

Rajini kanth 2.0 movie up dates

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఫ్యాన్స్‌తో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ‘2.0’ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ‘రోబో’ దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘2.0’ చిత్రం కూడా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇక శంకర్‌ ఈ సినిమాను హాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమాకు ఖర్చు చేయని బడ్జెట్‌ను ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నారు. 

సినిమా ప్రారంభం సమయంలో ఇదే సంవత్సరం సినిమాను విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సినిమా ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని, ఒక్క పాట మినహా షూటింగ్‌ అయ్యింది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అయితే భారీ గ్రాఫిక్స్‌ ఈ సినిమాలో చూపించేందుకు దర్శకుడు శంకర్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే హాలీవుడ్‌ సినిమాలకు పని చేసిన ప్రముఖ విజువల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణులను తీసుకు వస్తున్నాడు. ‘2.0’ చిత్రంలో అద్బుతమైన విజువల్స్‌ను అందించేందుకు శంకర్‌ తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మిగిలి ఉన్న పాటను త్వరలోనే పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఆరంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. రజినీకాంత్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎమీజాక్సన్‌ నటిస్తుండగా, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

మరిన్నివార్తలు

ఫిదా మూవీ ప్రివ్యూ.

మిత్రులే నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు