డ్రగ్స్‌ వ్యవహారంపై వర్మ స్పందించడేం

Ram Gopal Varma Not Responds To The Drug Dealings

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తనకు సంబంధం ఉన్నా, సంబంధం లేకున్నా కూడా దాదాపు అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. అయితే గత వారం పది రోజులుగా టాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్న డ్రగ్స్‌ ఇష్యూపై మాత్రం వర్మ స్పందించడం లేదు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడా అంటే అది కూడా లేదు. ఏదో యూట్యూబ్‌ సిరీస్‌ను రెడీ చేస్తున్నాడు. మరి ఎందుకు వర్మ ఈ విషయమై స్పందించడం లేదు అంటూ అందరు ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. వర్మకు కూడా డ్రగ్స్‌ అలవాటు ఉండి ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కెల్విన్‌ వద్ద వర్మకు సబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని, దాంతో పోలీసులు ఆయన్ను టచ్‌ చేయడం లేదు అనేది సినీ వర్గాల్లో వినిపిస్తున్న వాదన. తనకు సంబంధం ఉన్నా లేకున్నా కూడా ఈ విషయమై వర్మ స్పందిస్తాడని అనుకున్నాం. వర్మకు సన్నిహితుడు అయిన పూరి ఈ వివాదంలో ప్రథమ దోషిగా ఉన్న కారణంగా వర్మ ఏదైనా వాఖ్యలు చేసే అవకాశాలున్నాయని మొదట భావించారు. కాని ఇప్పటి వరకు కూడా వర్మ చిన్న కామెంట్‌ కూడా చేయక పోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సున్నితమైన అంశం కనుక ఎందుకు కదపడం అనుకుంటున్నాడో ఏమో అని కొందరి భావన, మరి కొందరు మాత్రం వివాదాలకు దూరంగా వర్మ ఉండాలని భావిస్తున్నాడు. అందుకే ఏ వ్యాఖ్యలు చేయడం లేదు అంటున్నారు.

మరిన్ని వార్తలు: