మధు మేహం… ఆయుర్వేదం

diabetes reason and ayurvedic medicine

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వేదకాలంలో మధు మేహ వ్యాధి ప్రస్తావన ఉంది . ఆ కాలంలో మధు మేహాన్ని ఆశ్రవ అని పేరుతో గుర్తించారు . క్రీస్తు శకానికి వెయ్యి సంవత్సరాల క్రిందట ఈ వ్యాధి వర్ణన ఉంది . ఆరవ శతాబ్దంలో అష్టాంగ హృదయం అనే గ్రంధంలో మధు మేహం అనే పదం వాడబడింది .
# మన దేశంలో ఈ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకు పెరుగు తున్నారు.

మధు మేహ వ్యాధి — కారణాలు .

# ప్యాంక్రియాస్ లోని బీటా కణాలు పాడై పోయి , ఆ గ్రంధి ఇన్సులిన్ ని తయారు చేయలేక పోవడం లేక ఆల్ప మోతాదులో తయారు చేరడం వల్ల ఈ వ్యాధి వస్తుంది .
# మనిషిలోని ఇన్సులిన్ హార్మోన్ పని తీరు దెబ్బతినప్పుడు , శరీరం గ్లూకోజును సరిగ్గా వినియోగించు కోనప్పుడు ఈ వ్యాది వస్తుంది .
# వంశపారం పర్యంగా మధు మేహం వచ్చే అవకాశం కలదు .
# శారీరక శ్రమ పూర్తిగా లోపించడం , గంటల తరబడి కూర్చోని ఉండటం ,
# పోషక పదార్ధాలు లేని ఆహారం తీసుకోవడం వలన కూడా ఈ వ్యాధి వస్తుంది .
# కొన్ని రకాల మందుల దుష్ఫరిణామం,స్టెరాయిడ్స్,వైరస్ ఇన్పెక్షన్స్,హార్మోన్ల అసమతుల్యత వల్ల మధు మేహం వస్తుంది .
# తిన్న ఆహారం జీర్ణం కాక ముందే తిరిగి భుజించడం, ఆకలి లేకున్నా ఆహారం తీసుకోవడం వలన మధు మేహం వస్తుంది. 
# అధికంగా చక్కెర ఉపయోగించడం .
# అతిగా నిద్ర పోవడం .
# మానసిక ఆందోళన , భారీకాయం మరియు ఆహారపు అలవాట్లు .
# తరచుగా జబ్బులతో బాధ పడువారు . రోగ నిరోధక శక్తిని కోల్పోయి — మధు మేహ వ్యాధి రావచ్చును .

మధు మేహ వ్యాధి లక్షణాలు : —
# అతి మూత్రం , దాహం ఎక్కువగా వేయడం , కంటి చూపు మందగించడం , బరువు తగ్గడం , మలబద్ధకం , శృంగార శక్తి తగ్గుట , గాయాలు త్వరగా మానక పోవడం , హృద్రోగాలు , మూత్ర పిండాలు దెబ్బతినడం , స్త్రీలలో అసాధారణంగా తెల్ల బట్ట ( White Discharge ) కావడం , చర్మ వ్యాధులు , కాళ్ళు , చేతులు , అరచేతులు తిమ్మిరిగా వుండడం , త్వరగా అలసి పోవడం , చికాకు , అసహనం కలిగి వుంటారు .
# మధు మేహ వ్యాధిగ్రస్తుతులకు మెట్ట మొదట ఆకలి ఎక్కువగా ఉండటం , కాని నిధానంగా ఆకలి వుండదు .
# మధు మేహం వలన ఎక్కవ శాతం అన్ని అవయవాలకు అనారోగ్యం కలిగే అవకాశం ఉంది . ( మూత్ర పిండాలు , గుండె , రక్తనాళాలు , కళ్ళు ) .

ఆయుర్వేధ ఔషధాలు మధు మేహ వ్యాధిని శక్తివంతంగా తగ్గిస్తాయి : —

గృహ చికిత్స :—-

1. మెంతుల పొడి ….. 100 గ్రాములు .
2 .బిరియాని ఆకుల పొడి …. 100 గ్రాములు .
3 . నేరేడు గింజల పొడి … 150 గ్రాములు .
4 . బిల్వ పత్రముల పొడి .. 250 గ్రాములు .
( బిల్వం ఆకులు )
గమనిక : — ఈ బిల్వం ఆకులను గుడిలో శివుడికి అర్పించి , తర్వాత ఆ ఆకులను ఎండలో ఎండ పెట్టి పొడి చేయవలెన.
ఈ 4 రకాల పొడులను బాగా కలిపి గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకొండి

ఈ చూర్ణం వాడే విధానము : —

# ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి 1 గంట ముందు 1 Tea Spoon చూర్ణంని + 1 గ్లాసు వేడి నీళ్ళలో కలిపి త్రాగండి.
# ప్రతి రోజు రాత్రి భోజనం చేయడానికి 1 గంట ముందు 1 Tea Spoon చూర్ణంని + 1 గ్లాసు వేడి నీళ్ళలో కలిపి త్రాగండి .

ప్రతి రోజు రెండు పూటల ఈ చూర్ణంని తీసుకొనవలెను
ఈ చూర్ణంని 2 లేక 3 నెలల వరకు తీసుకొనండి
ఈ చూర్ణంని పూర్వం ఆయుర్వేద వైద్యులందరు ఉపయోగించి , ఫలితం పోందినారు.

ఖచ్చితంగా మార్పు చేసుకోవలసిన జీవన విధానం : —

1. నీళ్ళు త్రాగే విధానం

నీటిని ఎప్పుడు త్రాగినా గుటక గుటక గా త్రాగాలి . బ్రేక్ ఫాస్ట్ , భోజనమునకు 40 నిమిషాల ముందు త్రాగవలెను . బ్రేక్ ఫాస్ట్ , భోజనము మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును . ఆహారం తీసుకున్న తర్వాత గొంతు శుద్ది కోసం , గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును .
ఆహారం తీసుకున్న తర్వాత 1 1/2 గంట తర్వాత నీళ్ళు త్రాగాలి .

పై విధంగా నీళ్ళు త్రాగడం వలన మలబద్ధకం రాదు , నివారింపబడును . శరీరంలో తిన్న ఆహారం కుళ్ళదు , చెడు కొలెస్ట్రాల్ ‌( L.D.L / V.L.D.L ) తయారవ్వదు .

వంట నూనెలు

శుద్దమైన వంట నూనె ( Non Refined Oil ) ను తయారు చేసే ఆహారంలో వాడవలెను. అప్పుడు శరీరంలో లివర్ సహాయంతో మంచి కొలెస్ట్రాల్ ( H.D.L ) ఎక్కవ మోతాదులో తయారవుతుంది . ఈ H.D.L .వలన స్ధూలకాయం , అధిక బరువు తగ్గిపోతుంది . చెడుకొలెస్ట్రాల్ తగ్గిపోతుంది .
Non Refined oils వేరుశనగ నూనె , నువ్వుల నూనె లేక కుసుమల నూనెలను వాడండి .

ఉప్పు : —
ఎల్లప్పుడు వంటలలో సైంధవ లవణం ( Rock Salt ) నే వాడండి. ఈ Rock Salt ని వాడితే B. P. Normal అవుతుంది .

మట్టిపాత్రలు

మట్టి పాత్రలు పరమ పవిత్రమైనది . మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి , సూర్యరశ్మి తగిలేలాగా ఆహారం వండు కోవాలి . అందుకు మట్టి పాత్రలు , ఇత్తడి , రాగి పాత్రలు అత్యుత్తమము . కాని మట్టి పాత్రలో వండిన పదార్ధములో 100 % న్యూట్రియన్స్ ఉంటాయి . ఈ పదార్ధానికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది . డయాబెటీస్ ఏ స్ధాయిలో ఉన్నవారికైన ఈ పద్ధతిలో భోజనం వండి పెట్టండి . 2 – 3 నెలల లోపే ఖచ్చితంగా వారు డయాబెటీస్ రోగం నుండి విముక్థ లవుతారు . ఆనందంగా జీవిస్తారు .

చక్కెర ( Sugar ) = విషం
విదేశీయులు కనిపెట్టిన ఈ చక్కెర లో ఎటువంటి పోషకాలు , విటమిన్స్ మొదలగునవి ఏమియు లేవు . చక్కెర తయారు కాగానే అందులోని ఫాస్ఫరస్ అంతమై పోతుంది . కఫాన్ని సక్రమంగా ఉంచటానికి ఈ ఫాస్ఫరస్ ఎంతో ముఖ్యం . చక్కెరని , చక్కెరతో తిన్న ఆహారాన్ని జీర్ణం చెయ్యటానికి కడుపు ఎంతో కష్టపడ వలసి ఉంటుంది . కడుపులో చక్కెర జీర్ణమయ్యాక మిగిలేది యాసిడ్ . ఈ యాసిడ్ అనేక రోగాలకు మూలం . మధు మేహ వ్యాధి గ్రస్తులు చక్కెరని తినరాదు . చక్కెరని తింటుంన్నంత వరకూ మీ వ్యాధి బాగు కాదు . ఆరోగ్యవంతులు కూడా ఈ చక్కెరను తినవలదు . బెల్లంతో చేసిన పదార్ధాలు తినడం ఆరోగ్యకరం .

ప్రెషర్ కుక్కర్

ఆయుర్వేద ప్రకారం ఏ ఆహారమైన ని వండేటప్పుడు గాలి , వెలుతురు తగులుతూ వుండ వలెను . ప్రెషర్ కుక్కర్ లో వండిన ఆహారానికి ఏ మాత్రమూ గాలి , వెలుతురు తగిలే అవకాశమే లేదు . ఆయుర్వేద ప్రకారం ఈ ఆహారము విషంతో సమానం .ఈ ప్రెషర్ కుక్కర్ తయారు చేసేది అల్యూమినియంతో . అల్యూమినియం పాత్రలు ఆహారం వండటానికి , పదార్ధాలు నిల్వ వుంచటానికి ఏ మాత్రం పనికి రావు . ఈ పాత్రలలో వండిన ఆహారం మళ్ళీ మళ్ళీ తింటూ వుంటే మధ మేహం , జీర్ణ సంబంధిత , టి.బి., ఆస్తమా మరియు కీళ్ళ సంబంధ వ్యాధులు తప్పకుండా వస్తాయి . కావున మట్టి పాత్రలు లేక ఇత్తడి పాత్రలను వాడండి . ప్రెషర్ కుక్కర్ లో వండిన ఆహారంలో 13 % న్యూట్రియన్స్ ఉన్నాయి . కావున శరీరానికి కావలసిన పోషకాలు లభించనందు వలన *మధు మేహ వ్యాధి వచ్చును

# మధు మేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి పరిస్ధితులలో INSULIN ని వాడరాదు .చక్కెర వ్యాధి కంటే ఈ Insulin ఎక్కవ ప్రమాధకరం . Side effects ఎక్కవగా వుంటాయి .

బెల్లం ( Jaggery ) .

బెల్లం ఔషధాల గని. పాత తరంలో బెల్లంతోనే పలురకాల తిండి పదార్ధాలను వండే వారు . ప్రస్తుతం చక్కెర వల్ల బలవర్ధకమైన బెల్లని కోల్పోతున్నాం . చక్కెర వల్ల పలు దుష్ ప్రభావాలు పొడ చూపుతున్నాయి . కఫాన్ని సక్రమంగా ఉంచటానికి ఫాస్ఫరస్ ఎంతో ముఖ్యం . ఇది బెల్లంలో పరిపుర్ణంగా ఉంది .

పండ్లు : —

ప్రకృతి సిద్ధమైన తీపి తినవచ్చును . భగవంతుడు ప్రసాదించిన తీపి పండ్లలో తేలికగా జీర్ణమయ్యే ఫ్రక్టోజ్ అనే తీపి వుంటుంది. కావున ఈ పండ్లను తినవచ్చును .పక్వమైన మామిడి పండ్లు , ద్రాక్ష , అరటి పండ్లు , కమలా పండ్లు , బత్తాయి పండ్లు , దానిమ్మ , బొప్పాయి మరియు ఆపిల్ .

HIGH FIBER & LOW FAT DIET :–

చిరుధాన్యాలలో ఎక్కువ పీచు పదార్ధం మరియు Low Fat వుంటుంది .ప్రతి రోజు ఒక పూట చిరుధాన్యాలను తినవలెను .
చిరు ధాన్యాలు ( Millets )
రాగులు , జొన్నలు , అరికలు , వరిగలు , సామలు , ఊదలు మరియు కొర్రలు .
# ప్రాణాయామం చేయ వలెను

గమనిక :—-

# ఆయుర్వేద ఔషదాలు మధు మేహ వ్యాధిని శక్తి వంతంగా తగ్గిస్తాయి . మధు మేహాన్ని తగ్గించటానికి గాను , అల్లోపతి మందులను కూడా వాడితే , ఆయుర్వేద ఔషదాలను వాడే ముందు మీ ఆయుర్వేధ వైద్యుడిని , నిపుణులని సంప్రదించటం చాలా మంచిది .
# టూత్ పేస్ట్ లో అధిక మోతాదులో చక్కెర వుండును. వాడరాదు . ఆయుర్వేద టూత్ పేస్ట్ లు , టూత్ పౌడరులు వాడండి .
# Cool Drinks లలో అధిక మోతాదులో చక్కెర వుండును . త్రాగరాదు .

——- శ్రీ రాజీవ్ దీక్షిత్

మరిన్ని వార్తలు

ఫిదా మూవీ ప్రివ్యూ.

‘ఆనందోబ్రహ్మ’ ట్రైలర్‌ రివ్యూ

మిత్రులే నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు