రోబో 2.0 కొత్త పోస్టర్లు – అంచనాలని పెంచడం ఖాయం

Rajini robo 2.0 Movie New posters

రజినీకాంత్ వశీకర్ గా, రోబో గా నటిస్తున్న భారీ గ్రాఫిక్స్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘రోబో 2.0’ హాట్ టాపిక్ గా మారింది. రజిని అభిమానులంతా ఎప్పుడెప్పుడూ థియేటర్లలోకి వస్తుందా, ఎప్పుడెప్పుడూ చూసెయ్యాలా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా వచ్చే గురువారం అనగా నవంబర్ 29 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన రెండు కొత్త పోస్టర్లని మేకర్స్ విడుదల చేసారు.

image.pngఒక పోస్టర్లో పరుగెడుతున్న రజినీకాంత్ తో పాటు, అతని వెనుక ఆటోల మీదనుండి దూకుతున్న మరో హ్యూమనోయిడ్ రోబో పాత్రలో అమీ జాక్సన్ కూడా విన్యాసాలు చేస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తుండగా, ఈ సినిమా తెలుగు హక్కులను దాదాపు 80 కోట్లకి దిల్ రాజు మరియు ఇంకో ఇద్దరు నిర్మాతలు కలిసి దక్కించుకొని, తెలుగులో 1200 స్క్రీన్లలో విడుదలచేయబోతున్నారు. ఏ. ఆర్. రెహ్మాన్ అందించిన సంగీతం ఒక మోస్తరుగా ఉండడంతో పాటలు ఇంకా ఎవరికి ఎక్కలేదు. ఈ సినిమా భారీ విజయం ఖాయం అని నిర్మాతలు చెప్తున్నారు.

image.png