ఇక సూప‌ర్ స్టార్ కాదు… ఓన్లీ ర‌జ‌నీకాంత్

Rajinikanth removes Superstar Tag from Twitter account
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్… ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రగా ఉండేందుకు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండ‌ని ర‌జ‌నీ… ఇప్పుడు మాత్రం త‌న వైఖ‌రి మార్చుకున్నారు. ఇటీవ‌లే ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఎకౌంట్ క్రియేట్ చేసుకున్న ర‌జ‌నీ ఇప్పుడు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ట్విట్ట‌ర్ లో త‌న పేరును మార్చుకున్నారు. త‌ర‌చుగా ట్వీట్లు చేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ…

2013లో ర‌జ‌నీ ట్విట్ట‌ర్ లో ప్ర‌వేశించారు. అప్పుడ‌ప్పుడు ట్విట్ట‌ర్ లో ఆయ‌న త‌న అభిప్రాయాలు వ్య‌క్తంచేస్తుంటారు. ట్విట్ట‌ర్ లో ఆయ‌న పేరు @సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అని ఉంటుంది. అయితే సూప‌ర్ స్టార్ ఇమేజ్ ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ఇబ్బందిగా ఉంటుంద‌నుకున్నారో ఏమో కానీ… త‌న ఎకౌంట్ నేమ్ లో నుంచి ర‌జ‌నీ ఆ బిరుదును తీసివేశారు. @ ర‌జ‌నీకాంత్ గా త‌న ఎకౌంట్ ను మార్చుకున్నారు. అయితే ఆయ‌న అభిమానులు మాత్రం దీనిపై అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు. సూప‌ర్ స్టార్ కు ప‌ర్యాయ‌ప‌దంగా నిలిచిన ర‌జ‌నీ ఆ బిరుదును తొల‌గించుకోవ‌డం ఏదో వెలితిగా ఉందంటున్నారు ఆయ‌న అభిమానులు. కానీ ర‌జనీ మాత్రం సూప‌ర్ స్టార్ బిరుదును వెండితెర‌కే వ‌దిలేశారు. నిజ‌జీవితంలో ఎంతో నిరాడంబ‌రంగా ఉండే ర‌జ‌నీ… రాజ‌కీయాల్లోనూ ఆ నిరాడంబ‌ర‌త్వాన్ని కొన‌సాగించాల‌నుకుంటున్నారు.