రాక్షసుడు సినిమా ప్రివ్యూ

rakshasudu-movie-preview
టాలీవుడ్ లో వారసులకు కొదవలేదు. హీరోల వారసులు అయితే ఒకటి రెండు సినిమాలతో సెట్ అయిపోతారు. కానీ నిర్మాతల తనయులకు మాత్రం టైమ్ అంతగా కలిసి రాదు. వాళ్లు బాగా కష్టపడితే కానీ సక్సెస్ కావడం చాలా అరుదు.
వెంకటేష్, జగపతి బాబు లాంటి ఒకరిద్దరు తప్ప నిర్మాతల కొడుకులు స్టార్లుగా మారింది లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ చరిత్రను తిరగరాయాలని చూస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ ఆయనకు ఒక్క కథ కూడా సహకరించడం లేదు. ఇప్పటి వరకు నటించిన ఆరు సినిమాలు పరాజయాలే.
మొన్న విడుదలైన తేజ సీత కూడా డిజాస్టరే. ఇప్పుడు ఈయన రాక్షసుడు సినిమాతో వస్తున్నాడు. ఆగస్ట్ 2న విడుదల కానుంది ఈ చిత్రం. తమిళనాట బ్లాక్ బస్టర్ గా నిలిచిన రాచ్చసన్ సినిమాను ఇక్కడ రీమేక్ చేసారు. ఈ సినిమాను ఉన్నదున్నట్లు తీసినా కూడా సూపర్ హిట్ అవుతుందని చెబుతున్నారు విశ్లేషకులు.
అందుకే ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ చిత్ర బిజినెస్ కూడా భారీగానే జరిగింది. థియెట్రికల్ రైట్స్ 16 కోట్ల వరకు అమ్ముడు కాగా.. శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ కలిసి 18 కోట్లకు పైగానే వచ్చాయి. దాంతో మొత్తంగా 35 కోట్ల బిజినెస్ చేసింది ఈ చిత్రం.
వరుసగా ఫ్లాపులు వస్తున్నా అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి బెల్లంకొండ శ్రీనివాస్ కు. కాకపోతే ఇప్పటివరకు విజయం అనేది తలుపుతట్టలేదు. కచ్చితంగా రాక్షుడు సినిమాతోనే ఇది అందుకుంటారని ధీమాగా చెబుతున్నారు
బెల్లంకొండ. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా తనకు అండగా నిలుస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు బెల్లంకొండ వారసుడు. మరి ఈయనకు తొలి విజయాన్ని అందించే ఆ దర్శకుడు ఎక్కడున్నాడో చూడాలి.