షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రకుల్ ప్రీత్

షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రకుల్ ప్రీత్

కరోనా మహమ్మారి వలన ఈ ఏడాది ఊహించని విధంగా నెలకొన్న పరిస్థితుల మూలాన అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమలో కూడా ఎలాంటి నష్టం వాటిల్లిందో మన అందరికీ తెలిసిందే. దీనితో ఎన్నో చిత్రాల షూటింగులు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా షూటింగులు కూడా మొదలవుతున్నాయి. అయితే ఇంతకు ముందు మాత్రం షూటింగులకు అనుమతులు వచ్చినా సరే చాలా మంది స్టార్ హీరోలు సైతం షూటింగ్ లో పాల్గొనేందుకు ఇష్టపడలేదు.కానీ ఇప్పుడు ఒక్కొక్కరిగా పరిస్థితులు అలా ఉన్నప్పటికీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

అయితే మొట్ట మొదటిగా ఈ పరిస్థితిలో ముందడుగు వేసిన స్టార్ హీరోయిన్ మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ అనే చెప్పాలి. తాను లేటెస్ట్ గా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మన టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వికారాబాద్ అడవుల్లో మొదలు కానుంది. ఇక అక్కడ నుంచి రకుల్ 40 రోజుల పాటు కొనసాగే ఈ సింగిల్ షెడ్యూల్ లో పాల్గొననుంది.