ఆర్‌ మల్టీస్టారర్‌లో ఛాన్స్‌ కొట్టేసిందా?

rakul preet singh in RRR movie

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం నవంబర్‌ లేదా జనవరిలో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. మరో వైపు రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు వారి వారి చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇద్దరు కూడా నవంబర్‌ వరకు పూర్తి అయ్యేలా ప్లాన్‌ చేసుకున్నారు. ఇక ఆర్‌ మల్టీస్టారర్‌ మూవీలో హీరోయిన్స్‌ గురించి ఆరు నెలలుగా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. మొదట బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ను ఈ చిత్రంలో జక్కన్న తీసుకునే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కాదు, సౌత్‌ హీరోయిన్స్‌ ఈ మల్టీస్టారర్‌లో కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఆ హీరోయిన్స్‌ ఎవరు అనే విషయంలో క్లారిటీ రాలేదు. తాజాగా ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఒక హీరోయిన్‌గా ఎంపిక అయినట్లుగా ప్రచారం జరుగుతుంది.

నిన్న మొన్నటి వరకు మల్టీస్టారర్‌ చిత్రంలో కీర్తి సురేష్‌ మరియు అదితి రావు హీరోయిన్స్‌గా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ ఇద్దరిలో ఎవరు మిస్‌ అవుతున్నారో తెలియదు కాని, ఇప్పుడు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో దానయ్య అండ్‌ టీం చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఆర్‌ మల్టీస్టారర్‌ చిత్రాన్ని నిర్మిస్తున్న దానయ్య స్వయంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను కలుసుకోవడంతో చర్చనీయాంశం అవుతుంది. ఖచ్చితంగా దానయ్య ఆమెను మల్టీస్టారర్‌ మూవీ గురించి కలుసుకుని ఉంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి హీరోయిన్స్‌ అంతా కూడా క్యూ కట్టి వెయిట్‌ చేస్తారు. అలాంటిది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఈ సమయంలో అవకాశం రావడం అదృష్టంగా చెప్పుకోవచ్చు. గత సంవత్సర కాలంగా రకుల్‌కు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఆమెకు ఈ మూవీలో నటించే ఛాన్స్‌ దక్కితే మరో రెండు మూడు సంవత్సరాలు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగడం ఖాయం అంటున్నారు.