ఆ ట్రాప్ లో పడొద్దని వరుణ్ తేజ్ కు సూచించిన రామ్ చరణ్.. ఏం జరిగిందిoటే ?

Varun Tej
Varun Tej

మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ భిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు ఆ సినిమాలు సక్సెస్ సాధించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కిన గాండీవధారి అర్జున సినిమా ఈ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కూడ ఈ ఏడాదే జరగనుండగా త్వరలో పెళ్లి తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

అయితే గాండీవధారి అర్జున సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నేను 7వ సినిమా చేస్తున్న సమయంలో రామ్ చరణ్ నాతో ఒక మాట చెప్పారని కొత్తగా ప్రయత్నించడానికి ఇదే సరైన సమయమని మనస్సుకు నచ్చిన సినిమా చేయాలని రామ్ చరణ్సూ చించారని వరుణ్ తేజ్ అన్నారు.భవిష్యత్తులో బిజినెస్, మార్కెట్ పెరుగుతుందని ఆ సమయంలో కొన్ని సినిమాలు చేయాలన్నా సాధ్యం కాదని చరణ్ చెప్పాడని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు.

ఇప్పటినుంచి అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నచ్చిన సినిమా చేయాలని సూచించడానీ కొన్ని కథలు చేయాలని అనిపించినా చేయలేకపోతున్నాను. అని చరణ్ నాతో అన్నాడని ఆ ట్రాప్ లో పడద్దనించార నాకు సూచనలు చేశాడని వరుణ్ తేజ్ వెల్లడించారు. వరుణ్ తేజ్ చెప్పిన. విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ప్రవీణ్ సత్తారు గత సినిమా ది ఘోస్ట్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తేనే ప్రవీణ్ సత్తారుకు కొత్త ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది.సోలో హీరోగా భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని వరుణ్ తేజ్ భావిస్తున్నారు.బ్రో, భోళా శంకర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ గాండీవధారి అర్జున సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.