వర్మ కొత్త అమ్మాయిని ముందుకు తెచ్చాడు.

ram gopal varma and nagarjuna movie heroine Myra Sareen

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పూర్తిగా నాగార్జున తో చేస్తున్న సినిమా పనిలో పడిపోయాడు. ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నదానిపై రకరకాల పుకార్లు వినిపించాయి. టబు మొదలుకుని ఎన్నో అనుష్క దాకా ఎన్నో పేర్లు బయటకు తీసుకొచ్చింది మీడియా , సోషల్ మీడియా. అయితే అవన్నీ తప్పు అని రాము తేల్చేసాడు. నాగ్ తో పని చేస్తున్న సినిమాలో కొత్త అమ్మాయి మైరా సరీన్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఆమె ఫోటో కూడా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసాడు వర్మ.
RGV---Nag's-Film-Heroine
రాము సినిమాలు ఫెయిల్ అయ్యాయేమో గానీ ఆయన ప్రమోట్ చేసిన హీరోయిన్స్ చాలా మంది ఇండస్ట్రీలో బాగానే నిలబడ్డారు. రంగీలా హీరోయిన్ ఊర్మిళతో పాటు మరికొందరు రాము చలవతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఆంత్రమాలి, నిషా కొఠారి లాంటి వాళ్ళు ఎన్ని అవకాశాలు వచ్చినా పాపం సక్సెస్ కి దూరంగానే ఉండిపోయారు.
varma-post
అయితే ఏ ఒక్క హీరోయిన్ సక్సెస్ , ఫెయిల్యూర్ విషయంలో కూడా తానేదో చేశానని చెప్పుకోడానికి వర్మ సిద్ధంగా ఉండడు. ఇప్పుడు మైరా విషయం కూడా అంతే కావొచ్చు. అయితే చాన్నాళ్ల తర్వాత వర్మ స్కూల్ నుంచి వస్తున్న ఈ కొత్త హీరోయిన్ లుక్స్ చూస్తుంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ఛాన్స్ వున్నట్టే కనిపిస్తోంది.
 nagarjuna movie heroine Myra Sareen