ఈయ‌న పేరు రాంగోపాల్ రెడ్డి

Ram Gopal Varma As Ram Gopal Reddy Photo Viral In Social Media
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అర్జున్ రెడ్డి సినిమాను విడుద‌ల త‌ర్వాత అంద‌రూ ఇష్ట‌ప‌డ్డారు కానీ… అంత‌కుముందు నుంచే… ఆ సినిమాను తెగ పొగిడింది మాత్రం ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌నే. సినిమా ఫ‌స్ట్ షోనే తాను చూస్తాన‌ని ప్ర‌క‌టించిన ఆర్జీవీ చెప్పిన‌ట్టుగానే… మూవీ చూసి వెంట‌నే రియాక్ట‌య్యాడు. సినిమాపై, తీసిన విధానంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అర్జున్ రెడ్డి సినిమాను, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను, డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డిని వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా వ‌ర్మ పొగుడుతూనే ఉన్నాడు. ఆయ‌న అభిమానం ఇలా పొగ‌డ్త‌ల‌కే ప‌రిమితం కాలేదు.

సాధార‌ణంగా ఓ సినిమా సెన్సేష‌న‌ల్ హిట్ అయితే ఆ సినిమా హీరో, హీరోయిన్ గెట‌ప్ ను, కాస్ట్యూమ్స్ ను అనుక‌రిస్తూ ఉంటారు సాధార‌ణ సినీ ప్రేక్ష‌కులు. ఆ హీరోలానో, హీరోయిన్ లానో క‌నిపించాల‌ని ట్రై చేస్తుంటారు. రాంగోపాల్ వ‌ర్మ కూడా అదే చేశాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ పొటోను మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఫొటోలో విజ‌య్ ముఖం స్థానంలో త‌న ఫేస్ ఉంచి… మార్ఫింగ్ చేసిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోకు రాంగోపాల్ రెడ్డి అనే క్యాప్ష‌న్ ఇచ్చాడు. వ‌ర్మ ఫొటో చూసిన విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌దాగా స్పందించాడు. ఆ ఫొటోను షేర్ చేసి ఆర్జీఆర్ ను ప‌రిచ‌యం చేస్తున్నాం…రామ్ గోపాల్ రెడ్డికి హ‌లో చెప్పండి అని క్యాప్ష‌న్ రాశాడు. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి వ‌ర్మ అంద‌రిలానే తానూ ఓ సాధార‌ణ అభిమానిని అని నిరూపించాడు.