AMB మల్టీప్లెక్స్ పై వర్మ హాట్ కామెంట్స్

Ram Gopal Varma Comments On Amb Theater

వివాదాల డైరక్టర్ రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఓ వార్త తో సోషల్ మీడియాలో నిలుస్తాడు. ఏదైనా వార్త గురుంచి విభిన్నమైన స్టైల్ లో స్పందిస్తాడు. పొగడాలన్నా రాంగోపాల్ వర్మనే, తిట్టాలన్నా రాంగోపాల్ వర్మ నే అనే విధంగా ఉంటుంది అయన మాట్లాడితే. తాజాగా ఈయన… ఏసియన్ సునీల్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన AMB సినిమాస్ ను సందర్శించాడు. దాని గురుంచి వర్మ తనదైనా స్టైల్ లో స్పందించాడు. మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో మహేష్ AMB మల్టీ ఫ్లెక్స్ ధియేటర్ కూడా అంత అందంగా ఉన్నది.

Ram Gopal Varma Comments

ధియేటర్ వాతావరణం చూస్తే మతి పోతుంది అని ట్విట్టర్ లో స్పందించాడు. ఈ ధియేటర్ ను డిసెంబర్ 2 న సూపర్ స్టార్ రజినీకాంత్ చేతుల మీదుగా ఓపెన్ చేయ్యనున్నాడు. హైదరాబాద్ లోని కొండాపూర్ జంక్షన్ లో మహేష్ బాబు మల్టీ ఫ్లెక్స్ ని ఏర్పాటు చేశారు. AMBలో మొత్తం 7 స్క్రీన్స్ ఉన్నాయి సిట్టింగ్ కెపాసిటీ మొత్తం 1600 మందికి పైగా కూర్చో వచ్చు. అత్యునతమైన సంకేతికతోతో 3డి టెక్నాలజీ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని పొందుతారు. ప్రేక్షకులు AMB మల్టీ ఫ్లెక్స్ లో సినిమా చూడాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు.