“లక్ష్మీస్ ఎన్టీఆర్” బయోపిక్ కాదు కానీ తేనె తుట్టె కదిపినట్టే…

Ram Gopal Varma Comments on Lakshmis NTR movie and Producer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు బయోపిక్ మీద ఇంకా రచ్చ కొనసాగుతూనే వుంది. దీనికి సంబంధించి వర్మ కొత్తగా మరికొంత సమాచారం బయటపెట్టాడు. ఎన్టీఆర్ బయోపిక్ తీయాలన్న లక్ష్యం తో పరిశోధన మొదలు పెడితే కొన్ని సంచలన విషయాలు వర్మ ని బాగా ఆకట్టుకున్నాయంట. అవి ఎన్టీఆర్ ని గందరగోళ పరిస్థితుల్లోకి నెత్తిన తెర వెనుక కారణాలు అని వర్మ ప్రకటించారు. పైగా లక్ష్మీపార్వతి చెప్పిన నిజానిజాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ పరిస్థితుల మీదే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయబోతున్నట్టు వర్మ ప్రకటించాడు. అయితే సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నట్టు ఈ సినిమాకి జేడీ నిర్మాతగా వ్యవహరించడం లేదని వర్మ చెప్పేసారు.

తాజాగా వర్మ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం, 1994 ఎన్నికలు, ఆగష్టు సంక్షోభం, వైస్రాయ్ ఎపిసోడ్ , ఎన్టీఆర్ మరణం చుట్టూ కథ నడిపించడానికి వర్మ రెడీ అయిపోయినట్టు వుంది. ఎన్టీఆర్ జీవితంలో బాగా సంచలనం అయ్యింది, వివాదాస్పదం అయ్యింది ఈ విషయాలే. ఇప్పుడు వాటిని మాత్రమే టచ్ చేస్తూ వర్మ తేనె తుట్టె కదపబోతున్నాడు. ఇంతకుముందు వర్మ వంగవీటి సినిమా టైం లోను ఇదే విధంగా ఎవరు చెప్పినా వినకుండా ముందుకు వెళ్లారు. ఇప్పుడు కూడా వర్మ అదే మూడ్ లో ముందుకు వెళుతున్నారు.