నాగ్‌ కోసం హాలీవుడ్‌ సినిమాను కాపీ కొడుతున్న వర్మ!!

Ram Gopal Varma copy to hollywood story for Nagarjuna

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘శివ’ చిత్రంతో చరిత్ర సృష్టించిన నాగార్జున మరియు రామ్‌గోపాల్‌ వర్మలు తాజాగా ఒక సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ‘శివ’ సినిమా తరహాలో కొత్త రకం స్క్రీన్‌ప్లే టెక్నిక్స్‌తో పాటు, విభిన్న తరహా టేకింగ్‌తో సినిమాను వర్మ తెరకెక్కిస్తాను అంటూ చెబుతున్నాడు. నాగార్జునను రామ్‌గోపాల్‌ వర్మ పోలీస్‌గా చూపించబోతున్నాడు. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ అయ్యింది. ఫస్ట్‌లుక్‌లో వర్మ మార్క్‌ కనిపించింది. నాగార్జున చాలా విభిన్నంగా, ఆకట్టుకునే విధంగా ఉన్నాడు.

Nag-Different-looks-in-RGV-

వర్మ గతంలో తాను చేసిన పలు సినిమాలు హాలీవుడ్‌ సినిమాలకు కాపీ అంటూ స్వయంగా చెప్పుకొచ్చాడు. వాటి సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం నాగార్జునతో వర్మ చేస్తున్న సినిమా హాలీవుడ్‌ సినిమాకు కాపీ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2008వ సంవత్సరంలో హాలీవుడ్‌ వచ్చిన ఒక కాప్‌ మూవీ కథను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని వర్మ ఈ కథను సిద్దం చేశాడని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం ఆ కథను పూర్తిగా దించేస్తున్నాడని, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథను మార్చి సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. వర్మ క్రియేటివిటీగా ఆలోచించడం చాలా కాలం క్రితమే మర్చి పోయాడని, ఇప్పుడు వర్మ క్రియేటివిటీని ఆశించడం తప్పు అవుతుంది. వర్మ కాపీ కథతో సినిమా చేసినా కూడా శివ వంటి సినిమాను ఇస్తే ప్రేక్షకులు ఇవన్ని మర్చి పోతారు.