నంది అవార్డుల రద్దు నిర్ణయం వెనక్కు..!

The filmmakers say that Nandi Awards can not be canceled.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]          

ఏపీ ప్రభుత్వం చాలా సంవత్సరాల తర్వాత నంది అవార్డులను ప్రకటించిన విషయం తెల్సిందే. 2014, 15,16 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యూరీ సభ్యులు మూడు సంవత్సరాలకు గాను నంది అవార్డుల విజేతలను ప్రకటించారు. అయితే జ్యూరీని ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ప్రభావితం చేసి, వారికి అనుకూలంగా ఉన్న వారికి అవార్డులు ఇప్పించుకున్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వంకు సన్నిహితంగా ఉన్న వారికి అవార్డులు వచ్చాయి అనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మెగా హీరోలకు పూర్తిగా అన్యాయం జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు.

ap-nandi-awards

రుద్రమదేవి చిత్రానికి ప్రాంతీయ తత్వంను అంటకట్టి సినిమాకు అవార్డు ఇవ్వలేదు అంటూ గుణశేఖర్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకా పలువురు ఇవి సైకిల్‌ అవార్డులని, కమ్మ అవార్డులు అంటూ ఆరోపణలు చేయడం జరిగింది. దాంతో ఏపీ ప్రభుత్వం అవార్డులను వెనక్కు తీసుకోవాలనే నిర్ణయంకు వచ్చిందని ప్రచారం జరిగింది. సినీ వర్గాల వారితో మరియు రాజకీయ వర్గాల వారితో ప్రభుత్వం చర్చలు జరిపింది. నంది అవార్డులను రద్దు చేయాలని భావిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమలో కొద్ది మందితో అనడం, వారు చంద్రబాబుకు నచ్చ జెప్పడం జరిగింది.

nandi-awrds-from-ap

ఏపీ ప్రభుత్వం ఒక వేళ నంది అవార్డులను ఇప్పుడు ఉపసంహరించుకుంటే పరువు పోవడం ఖాయం అని, విమర్శలు చేస్తున్న వారిని నోరు మూయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతుంది. సినిమా పరిశ్రమకు చెందిన కొందరు రంగంలోకి దిగి వివాదాన్ని పెంచుతున్న వారితో చర్చలు జరుపుతున్నారు. గుణశేఖర్‌, బన్నీ వాసు, బండ్ల గణేష్‌, బుజ్జిలతో పాటు ఇంకా పలువురితో చర్చలు జరిపి నంది అవార్డుల రచ్చకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని భావిస్తున్నారు. నంది అవార్డుల రద్దు నిర్ణయం లేనట్లే అని సినీ వర్గాల వారు కూడా అంటున్నారు. డిసెంబర్‌లో అమరావతిలో నంది అవార్డుల ప్రధానోత్సవం జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.